57 ఏళ్ళ‌ వ‌య‌సులో సినీ నిర్మాత సిక్స్‌ప్యాక్.. షాక్ గురిచేసిన డాక్టర్ వర్లు

ఇటీవల కాలంలో సెలబ్రిటీలతోపాటు సాధారణ ప్రజలు కూడా ఫిట్‌నెస్, హెల్త్‌పై దృష్టిపెడుతున్నారు. ఇప్పటి వరకు సినీ హీరోలే ఫిట్‌నెస్‌ సీరియస్‌గా తీసుకొంటే.. తాజాగా ఓ నిర్మాత కూడా సిక్స్‌ప్యాక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

ఇటీవల ఫీల్‌గుడ్ కాన్సెప్ట్‌తో వచ్చిన క్ష‌ణ క్ష‌ణం మూవీతో డా. వ‌ర్లు నిర్మాతగా మారారు. వయసుతో సంబంధం లేకుండా సిక్స్ ప్యాక్ సాధించి అందరికీ రోల్‌మోడల్‌గా నిలిచారు. గతంలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్‌గా రాణించిన డాక్టర్ వర్లు 57 ఏళ్ల వయసులో సిక్స్‌ప్యాక్ సాధించడంపై సినీ వర్గాలు ఆశ్చర్యాని వ్యక్తం చేస్తున్నారు.

 Kshana Khanam producer Dr Varlu shocks with Six pack fitness

సిక్స్ ప్యాక్ ఫిట్‌నెస్ సాధించిన సంద‌ర్భంగా డా. వ‌ర్లు మాట్లాడుతూ.. క‌రోనా విజృభిస్తున్న సమయంలో అందరి మాదిరిగానే నేను ఫిట్‌నెస్ కోస‌మే జిమ్‌లోకి అడ‌గు పెట్టాను. త‌ర్వాత సిక్స్ ప్యాక్ చేయాల‌ని అనిపించింది. మా ట్రైన‌ర్ వెంక‌ట్ నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత వర్కవుట్స్‌ను ఓ తపస్పులా ప్రాక్టీస్ చేశాను. ఎన్ని పనులు ఉన్నా జిమ్‌లో వర్కువట్స్ చేయకుండా ఉండలేదు. నేను సిక్స్ ప్యాక్ చేసిన తర్వాత గ్రాఫిక్స్ చేసిన వీడియోనా అని అడిగారు. పట్టుదల, కఠోరశ్రమ ఉంటే ఎవరైనా సిక్స్‌ప్యాక్ చేయవచ్చు అని తెలిపారు.

 Kshana Khanam producer Dr Varlu shocks with Six pack fitness
 Kshana Khanam producer Dr Varlu shocks with Six pack fitness

డాక్టర్ వర్లు ట్రైన‌ర్ వెంక‌ట్ మాట్లాడుతూ... నేను ఇప్పటి వరకు చాలా మందికి సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ ఇచ్చాను. సినీ ప్రముఖులకు కూడా వ్యక్తిగతంగా ట్రైనింగ్ ఇచ్చాను. కానీ డాక్టర్ వ‌ర్లు గారిని ప్ర‌త్యేక మైన స్టూడెంట్‌గా ఫీల్ అవుతా. 57 ఏళ్ళ వ‌య‌స్సులో ఫిట్‌నెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. కేవ‌లం ఆయ‌న ధృధ సంక‌ల్పంతోనే సాధ్యం అయ్యింది. అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X