రానా సమర్పణలో కొత్త సినిమా.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్షణం దర్శకుడు
క్షణం లాంటి డిఫరెంట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు.. ఇంత వరకు మరో చిత్రాన్ని తెరకెక్కించలేదు. క్షణం సినిమా హిట్ అయినా.. ఆ క్రెడిట్ మాత్రం దర్శకుడు రవికాంత్ ఖాతాలో పడలేదు. మూవీ సక్సెస్ అంతా అడివి శేష్ ఖాతాలోకే వెళ్లింది. అయితే ఇన్ని రోజులకు ఈ దర్శకుడు మరో చిత్రాన్ని ప్రకటించాడు.
అయితే ఈ సారి మాత్రం పూర్తిగా జానర్‌ను మార్చేసినట్టు కనిపిస్తోంది. 'క్షణం' తర్వాత ఇన్ని రోజులకు దర్శకుడు రవికాంత్ మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. సినిమా టైటిల్ 'కృష్ణ అండ్ హిస్ లీల'. 'గుంటూరు టాకీస్' ఫేమ్ సిద్దు ఇందు లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా లో శ్రద్ధ శ్రీనాథ్.. సీరత్ కపూర్.. శాలిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ రిలీజ్ చేశారు.

పోస్టర్ అయితే కలర్ఫుల్ గా ఉంది. ' నిజమైన పుకార్ల ఆధారంగా' (బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్) అని క్యాప్షన్ ఇస్తూ 'కృష్ణ అండ్ హిస్ లీల' అనే టైటిల్‌ను ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్.. వయకాం 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. హీరో సిద్ధూ రవికాంత్‌తో పాటు సహ రచయితగా వ్యవహరించాడు. మరి ఈ సినిమాతో అయినా రవికాంత్‌కు క్రెడిట్ వస్తుందా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











