Bheemla Nayak Pre Release: పవన్ కళ్యాణ్ కోసం రాబోతున్న కేటీఆర్.. ఆ హీరో కూడా..?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త వాతావరణం నెలకొంటుంది. స్టార్ హీరోల సినిమాల వేడుకల కోసం మిగతా స్టార్ హీరోలు కూడా ప్రత్యేక అతిథులుగా వస్తూ ఉండడం విశేషం. ఇక రాబోయే భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇటీవల డేట్ ఫిక్స్ చేసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుకకు ప్రముఖ రాజకీయ నాయకుడు కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయితే ఈ వేడుకకు మరో స్టార్ హీరో కూడా వస్తారని టాక్ వస్తోంది.

అందుకే భారీ స్థాయిలో
అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్ మొదటిసారి కలిసి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల అవుతోంది.. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో వున్నారు. అందుకే భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఫస్ట్ డే ఫస్ట్ షో
సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. ఇక థమన్ ఇచ్చిన సంగీతం కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో బజ్ అయితే క్రియేట్ చేసింది. మొదటి రోజు మొదటి షో చూడాలి అని ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాగే ట్రైలర్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి

గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకలు ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తున్నారు అనే విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా మరోసారి క్లారిటీ గా ఇచ్చేశారు.. హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈనెల 21వ తేదీన సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.. ఈ వేడుకకు పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

వారెవ్వా.. కేటీఆర్
చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలో ఒక భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుక జరుగుతోంది. ఇక వేడుక కోసం తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఐటీ మినిష్టర్ కేటీఆర్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు. ఇదివరకే కేటీఆర్ మెగా హీరోలకు సంబంధించిన కొన్ని ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఆ వేడుకలలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక్కసారిగా కేకలు వేశారు. అప్పుడు కేటీఆర్ వారెవ్వా అంటూ ఆ క్రేజ్ ను చూసి ఆశ్చర్యపోయారు.

మరో స్టార్ కూడా
ఇక మళ్లీ ఇన్నాళ్ళకు భీమ్లా నాయక్ సినిమాతో కేటీఆర్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలో పాల్గొనబోతున్నారు.. ఇక ఈ వేడుకకు మరొక స్టార్ హీరో కూడా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది. అతను మరెవరో కాదు మహేష్ బాబు అని కూడా అంటున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు మహేష్ బాబుని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం. మరి ఈ టాక్ ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











