twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ విరాళం.. అన్నా అంటూ ఆప్యాయంగా కేటీఆర్ రిప్లై

    |

    కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఇలాంటి సమయంలో ప్రభుత్వాలకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అది అందరి బాధ్యత అని తన వంతుగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల చొప్పున కోటి రూపాయాలను విరాళంగా ప్రకటించాడు. కేంద్ర ప్రభుత్వానికి కూడా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి తనలోని దేశభక్తిని చాటుకున్నాడు.

    పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో సినీ ఇండస్ట్రీలోని తారలంతా కదిలివచ్చారు. మొదటగా ఇది మొదలుపెట్టింది హీరో నితినే అయినా.. పవన్ పిలుపుతో సెలెబ్రిటీలంతా కదిలారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ 75 లక్షలు, ప్రభాస్ కోటి, త్రివిక్రమ్, కొరటాల శివ,అనిల్ రావిపూడి వంటి వారు స్పందించి తమ వంతుగా ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

    KTR reply To Pawan Kalyan On Donates To CM Relief Fund

    పవన్ కళ్యాణ్ ఇచ్చిన విరాళానికి స్పందించిన కేటీఆర్.. గొప్ప ముందడుగు అన్నా అంటూ ఆప్యాయంగా రిప్లై ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా తిరిగి రిప్లై ఇస్తూ.. థాంక్యూ సర్ మీ బాధ్యతను మీరు అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు.. దానికి మీకు హృదయ పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా.. ఇలాంటి ఆపత్కర సమయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు చేస్తున్న ప్రతీ పని ఎంతో గొప్పగా ఉందని కితాబిచ్చాడు.

    English summary
    KTR reply To Pawan Kalyan On Donates To CM Relief Fund. After Giving Donation toCM Relied Fund KTR Replied That Great Gesture Anna. To This Reply Pawan Kalyan Make A Tweet Again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X