Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
కేటీఆర్‌ను కలిసిన ‘ఊల్లాల ఊల్లాల’ యూనిట్.. చిత్రం విజయవంతం కావాలని ఆశించిన ఐటీ మినిస్టర్
నటరాజ్, నూరిన్, అంకిత హీరో-హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఊల్లాల ఊల్లాల'. సీనియర్ నటుడు సత్య ప్రకాష్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయo అవుతుండగా సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ. గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా "ఊల్లాల ఊల్లాల" చిత్రంలో నటించడమే కాక హీరోయిన్ నూరిన్‌కి డబ్బింగ్ చెప్పింది. తను పాడిన 'రాం రాం' పాట గురువారం విడుదలకి సిద్ధంగా ఉంది.
దర్శకుడు సత్యప్రకాష్, హీరో నటరాజ్, గాయని మంగ్లీ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలపడమే కాక సుఖీభవ క్రీయేషన్స్ పతాకంపై నిర్మించే చిత్రాలన్నీ మంచి విజయం సాధించాలని కేటీఆర్ మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు నిర్మాత ఏ.గురురాజ్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అక్కడే ఉన్న తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ గౌడ్‌ని నిర్మాతకి పరిచయం చేశారని తెలిపారు. ఆయన కూడా చిత్రానికి తనవంతు సహాయం చేస్తానని, చిత్రం మంచి విజయం సాధించేలా తోడ్పడతానని అన్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఏ . గురురాజ్ మాట్లాడుతూ.. 'మా బ్యానర్లో రక్షకభటుడు, ఆనందం మళ్లీ మొదలైంది, లవర్స్ డే చిత్రాల తర్వాత వస్తున్న సినిమా ఉల్లాలా ఉల్లాలా. ఇలాంటి కాన్సెప్ట్‌లు చాలా అరుదుగా వస్తుంటాయి. సత్యప్రకాశ్‌కి నటునిగా ఎంత పేరుందో, దర్శకునిగా అంతకన్నా ఎక్కువ పేరు ఈ చిత్రం ద్వారా వస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రాన్ని జనవరి 1న భారీగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామ'ని తెలిపారు.
దర్శకుడు సత్యప్రకాశ్ గారు మాట్లాడుతూ.. 'నేను దర్శకునిగా మా అబ్బాయిని నటరాజ్ ను ఈ చిత్రంతో హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాను అని కేటీఆర్‌కు చెప్పగా .. మీ అబ్బాయి మంచిగా ఎదగాలి, మీరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కేటీఆర్ అన్నారు'.