దటీజ్ ధనుష్ .. కంపుకొట్టే డంపింగ్ యార్డ్‌లో 10 గంటల పాటు ఓపిగ్గా షూటింగ్
పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ కావడం, సినిమా కోసం డెడికేషన్‌గా పనిచేయడం అందరి నటుల వల్లా కాదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఇలాంటి కళాకారులు వుండేవారేమో కానీ.. ఇప్పుడు అలాంటి వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఈ కోవకే వస్తారు ధనుష్. వైవిధ్యానికి కేరాఫ్‌గా నిలిచే ఆయన పాత్రకు తగ్గట్లుగా మలచుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఇదే ధనుష్‌ని మిగిలిన వారితో పోల్చితే ప్రత్యేకంగా నిలబెట్టింది. వయసుకు మించిన క్యారెక్టర్లలోనూ ఇమిడిపోగలడు.. యూత్ ఫుల్ రోల్స్‌లో ఎంటర్‌టైన్ చేయనూగలడు. లవ్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా జోనర్ అయినా తన మార్క్ చూపిస్తారు ధనుష్.
తాజాగా సినిమా పట్ల నిబద్ధత, వృత్తి పట్ల అంకిత భావాన్ని మరోసారి నిరూపించుకున్నారు ధనుష్. చెత్త వున్న చోట మనం పట్టుమని పది నిమిషాల సేపు నిలబడలేం. అలాంటిది డంపింగ్ యార్డ్ దగ్గర ఏకంగా 10 గంటల సేపు గడిపారు ధనుష్. షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఆయన అలాగే ఓపికగా వున్నారు. వివరాల్లోకి వెళితే.. ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్‌లో విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ' కుబేర 'చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది.

ముంబై మహానగరంలోని అతిపెద్ద డంపింగ్ యార్డ్‌లో ఓ సీన్‌ను షూట్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందట. ఆ సన్నివేశాలు నేచురల్‌గా ఉండాలనే ఉద్దేశంతో ధనుష్ దాదాపు 10 గంటల పాటు కనీసం మాస్క్ కూడా లేకుండా షూటింగ్‌లో గడిపినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు, నెటిజన్లు ధనుష్ అంకితభావం, క్రమశిక్షణను మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కుబేర సినిమాలో ధనుష్ డీగ్లామరైజ్ రోల్‌లో నటించనున్నారన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలోని కింగ్ నాగార్జున క్యారెక్టర్‌కు సంబంధించి ఫస్ట్ లుక్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేయగా దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నాగ్‌తో కలిసి ధనుష్ నటిస్తూ ఉండటం , ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండటంతో కుబేరపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇదిలావుండగా ధనుష్ క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. ఇప్పటికే ఆయన నటించిన కెప్టెన్ మిల్లర్ రిలీజ్ కాగా.. తమిళంలో రాయన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి స్వయంగా రచయితగా, దర్శకుడిగా పనిచేస్తున్నారు ధనుష్. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు కీలకపాత్ర పోషిస్తున్నారు.
మరోవైపు.. తన మామ, సూపర్‌స్టార్ రజనీకాంత్ బయోపిక్‌లోనూ ధనుష్ నటిస్తారని చిత్ర సీమలో ప్రచారం జరుగుతోంది. హిందీలో హిట్ చిత్రాలను నిర్మించిన సాజిద్ నడియాద్‌వాలా .. రజనీ బయోపిక్ హక్కులను పొందారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించేది ఎవరు..? హీరో ఎవరు..? ఇతర కీలకపాత్రలు ఎవరు పోషించనున్నారు..? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.


Click it and Unblock the Notifications











