Kuberaa Vs 8 Vasanthalu: ఇద్దరు స్టార్ హీరోలతో యంగ్ హీరోయిన్ పోటీ.. బాక్సాఫీస్ గెలుపెవ్వరిది?

టాలీవుడ్ లో ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటున్నాయి. భారీ చిత్రాలపై ప్రేక్షకుల ఫోకస్ ఉండింది. ఈ క్రమంలో పెద్ద చిత్రాలకు పోటీగా చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటం తెలుగు చిత్ర పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. బడా హీరోల సినిమాలకు పోటీగా ప్రస్తుతం ఓ చిన్న సినిమా విడుదల అవుతుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. స్టార్ హీరోలకు పోటీగా యంగ్ టాలెంట్ ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని మళ్లిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ తారగణంతో కుబేరా చిత్రం..
టాలీవుడ్ లో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థగా పేరొందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్, అమిగోస్ క్రియేషన్స్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం 'కుబేరా'. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కలిసి నటించడం విశేషం. నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కథనాయికగా నటించింది. రూ.120 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.

Kubera Vs 8 Vasanthalu

ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో 8 వసంతాలు..
మ్యాడ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అవంతిక సనిల్ కుమార్ ప్రస్తుతం 8 వసంతాలు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. అనంతిక సనిల్‌కుమార్, రవి తేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించారు. తల్లి మరణం తర్వాత కూతురు జీవిత పోరాటం నేపథ్యంలో ఈ బ్యూటీఫుల్ చిత్రం రాబోతోంది. మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ తో హీరోయిన్ వెండితెరపై ఆకట్టుకుంటోంది.

కుబేరా వర్సెస్ 8 వసంతాలు..
కోలీవుడ్ స్టార్ ధనుష్ లీడ్ రోల్ లో నటించిన కుబేరా చిత్రం ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరై సినిమాను విష్ చేశారు. మరోవైపు మ్యాడ్ మూవీ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ నటించిన 8 వసంతాలు చిత్ర ప్రమోషన్స్ కూడా జోరుగా నిర్వహిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ టీమ్. జూన్ 17న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈవెంట్ లో అనంతిక స్పెషల్ టాలెంట్స్ ప్రదర్శనతో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు.అయితే ఈ రెండు చిత్రాలు జూన్ 20న ఒకే రోజు విడుదల కాబోతుండుటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇద్దరు స్టార్ హీరోలపై నెగ్గుతుందా?
చిన్న చిత్రాలైనా కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చేస్తున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో నచ్చకపోతే స్టార్ హీరోల సినిమాలనైనా పాతాళానికి పడేస్తున్నారు. ఇలాంటి సమయంలో భారీ తారాగణం ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న వంటి వారు నటించిన చిత్రానికి పోటీగా యంగ్ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ నటించిన 8 వసంతాలు చిత్రం విడుదల కాబోతుండటం విశేషం. అయితే కొద్ది కాలంగా కథ బాగుంటే బ్లాక్ బాస్టర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు 8 వసంతాలు చిత్రాన్ని అదే ధైర్యంతో కుబేరాపై విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో స్టార్స్ వర్సెస్ యంగ్ టాలెంట్ అనే పంథా నెలకొంది. ఈ క్రమంలో ఈ చిత్రాల ఫలితాలు, బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉండబోతున్నాయనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X