Monalisa: కుంభమేళా బ్యూటీ ప్రేమాయణం.. ప్రియుడుతో పోలీస్‌స్టేషన్‌కు మోనాలిసా!

గతేడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన మధ్యప్రదేశ్ యువతి మోనాలిసా భోంస్లే (Monalisa Bhonsle). తన తేనె కళ్లతో, అమాయకపు చిరునవ్వుతో కోట్లాది మంది దృష్టిని ఆకర్షించిన ఈ యువతి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. తన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా రావడం విశేషం. బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా సినీ అవకాశాలు అందుకుంది. అయితే తాజాగా మోనాలిసా వ్యక్తిగత జీవితంలో ఓ వివాదంతో వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

గత ఏడాది ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించిన మోనాలిసా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె అందం, తేనె కళ్ల వల్ల నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ క్రేజ్ కారణంగా బాలీవుడ్ దర్శకుడు సరోజ్ మిశ్రా ఆమెకు 'ది డైరీ ఆఫ్ మణిపూర్' అనే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మలయాళంలో 'నాగమ్మ' అనే సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్టు సమాచారం. ఇక తెలుగులో సాయి చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'లైఫ్' అనే సినిమాలో కూడా మోనాలిసా హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి.

Kumbh Mela Viral Girl Monalisa Bhonsle Seeks Police Protection to Marry Facebook Lover

ఇదిలా ఉండగా మోనాలిసా వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ఆమె గత ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. వీరిద్దరికీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడి, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని సమాచారం. ఈ విషయాన్ని మోనాలిసా కుటుంబ సభ్యులు తెలుసుకున్న తర్వాత ఈ ప్రేమకు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. తమకు నచ్చని వ్యక్తితో పెళ్లి చేయాలని కుటుంబం ఒత్తిడి చేస్తోందని మోనాలిసా ఆరోపించింది.

ఈ నేపథ్యంలో మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో కలిసి కేరళలోని తిరువనంతపురం చేరుకుని అక్కడి తంపనూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తమకు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉందని, తమ ప్రేమను అడ్డుకుంటున్నారని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. పోలీసులు ఇద్దరి స్టేట్మెంట్లు నమోదు చేసి పరిస్థితిని పరిశీలించారు. శారీరక వేధింపులు ఏవీ జరగలేదని, కానీ బలవంతపు వివాహ ఒత్తిడి ఉందని మోనాలిసా పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోయినా చట్టపరమైన సహాయం అందిస్తామని పోలీసులు వెల్లడించారు.

మోనాలిసా ఇప్పటికే మేజర్ కావడంతో తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఉందని చెబుతోంది. సమాచారం ప్రకారం ఈ జంట తిరువనంతపురంలోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కుంభమేళా ద్వారా ఒక్కసారిగా స్టార్‌గా మారి సినిమా అవకాశాలు దక్కించుకున్న మోనాలిసా కెరీర్ పరంగా ముందుకు సాగుతున్న సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ ఈ వివాదం తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పూసలు అమ్మే అమ్మాయిగా ప్రారంభమైన మోనాలిసా ప్రయాణం ఇప్పుడు సినిమా హీరోయిన్ స్థాయికి చేరింది. అయితే ఆమె ప్రేమ, కుటుంబ విభేదాల వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Read more about: monalisa tollywood kumbh mela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X