విశ్వంభరలో మెగాస్టార్ అల్లుడు.. ఎలాంటి పాత్ర చేస్తున్నాడో తెలిస్తే!
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే హీరోగా పరిచయం అయినా.. తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌గా మారిపోయారు చిరంజీవి. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ తనదైన మార్కును చూపిస్తున్నారు. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా.. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఇలా ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర' అనే మూవీని చేస్తున్నారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమానే 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా తీస్తున్నారు. ఇందుకోసం ఈ చిత్రం కోసం మూవీ యూనిట్ భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి - యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి చిత్రీకరణ జరుగుతోంది. ఇలా ఇప్పటికే 30 శాతం కంటే ఎక్కువ టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మిగిలిన దాన్ని కూడా త్వరగానే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
విజువల్ వండర్‌గా రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఓ క్రేజీ నెగెటివ్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్‌ను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేసింది.
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాలో కునాల్ కపూర్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. ఇక, అమితాబ్ బచ్చన్ సోదరుడి అల్లుడైన కునాల్.. గతంలో 'దేవ్‌దాస్' మూవీలోనూ నటించాడు. ఇప్పుడు అతడి పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











