రేవ్ పార్టీకి రెండుసార్లు.. ఓ పాప వచ్చి.. కుర్చీతాత షాకింగ్ విషయాలు
తెలుగు వ్యాపార వేత్త జన్మదినం సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీ సంచలనం రేపింది. ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు న్యాయస్థానం జూన్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా పలుమార్లు నోటీసులు జారీ చేసినా హేమ ఏవో కారణాలతో గైర్హాజరైంది. దీంతో బెంగళూరు పోలీసులు సోమవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు.
అప్పుడు కూడా మీడియా కంట పడకుండా బుర్ఖా ధరించారు హేమ. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు హేమను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు పోలీసులు. అంతకుముందు కేసీ జనరల్ హాస్పిటల్‌లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే హేమ అరెస్ట్ తర్వాత కుర్చీతాత ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..

రేవ్ పార్టీకి తాను రెండు సార్లు వెళ్లానని.. రాత్రి 11.30 అయ్యిందంటే పార్టీకి వచ్చిన ఎవరి ఒంటిపైనా బట్టలు ఉండవని.. ఆడటం , పాడటం చేస్తారని, కట్టలకొద్దీ నోట్లు తీసి చల్లుతారని కుర్చీ తాత సంచలన వ్యాఖ్యలు చేశాడు.
నేను సిగరెట్ కాల్చి, డ్రింక్ తాగి ఓ మూలన కూర్చొన్నానని.. కానీ ఇంతలో ఓ పాప వచ్చి ఏం తాత డ్యాన్స్ చేయవా అని అడిగిందన్నాడు. ఈ గోల చూసి తాను పారిపోయి వచ్చేశానని అహ్మద్ పాషా అన్నాడు. ఏ ఆడపిల్లా రోడ్డెక్కొద్దన్నాడు. తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త లేదంటే మరేదైనా కారణం వల్లనో ఆడపిల్ల రోడ్డెక్కుతోందన్నాడు. ఎవరైనా ఆడపిల్లను తన కళ్లెదుట ఏడిపిస్తుంటే ఇంటికెళ్లి కొడతానని కుర్చీ తాత హెచ్చరించాడు.

ఇక కుర్చీ తాత విషయానికి వస్తే.. కుర్చీని మడతపెట్టి అంటూ ఊతపదం.. ని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వైరల్ చేయడంతో దానిని కాస్తా థమన్ గుంటూరు కారం సినిమాలో వాడేయడంతో కుర్చీ తాత ఫుల్ ఫేమస్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











