రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన హేమ.. ఎవరి ఒంటిపైనా బట్టలుండవ్.. కుర్చీ తాత సంచలన వ్యాఖ్యలు
కుర్చీ తాత అలియాస్ అహ్మద్ పాషా .. తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్, ఆ పరిసరాల్లో తిరుగుతూ సినిమాలకు రివ్యూలు, కొత్త సంగతులు చెబుతూ బాగా ఫేమస్ అయ్యాడు. అతనికి భార్య , పిల్లలు ఉన్నా.. ఇంట్లో వాళ్లని పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతూ వాళ్లని వీళ్లని తిడుతూ ఉంటాడు. ఆయన ఊత పదం 'కుర్చీని మడతపెట్టి'ని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వైరల్ చేయడంతో దానిని కాస్తా థమన్ గుంటూరు కారం సినిమాలో వాడేయడంతో కుర్చీ తాత ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఈ క్రేజ్‌ను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.
తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ, అందులో సినీనటి హేమ దొరకడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కుర్చీ తాత. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. రేవ్ పార్టీ అనేది భారతీయ సంస్కృతి కాదని, దానికి హాజరై హేమ అడ్డంగా దొరికిపోయిందని.. ఆమె జీవితం ఇప్పుడు నవ్వుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశాడు.

రేవ్ పార్టీలకు వెళ్లి విచ్చలవిడిగా తిరగడం, డ్రగ్స్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడం ఎందుకు అని కుర్చీ తాత ప్రశ్నించాడు. కొంతమంది అమ్మాయిలను హేమ రేవ్ పార్టీకి తీసుకెళ్లిందన్న ప్రచారంపై ఆయన స్పందించక పోవడం గమనార్హం.
రేవ్ పార్టీకి అందరూ అనుకున్నట్లుగా లక్షల్లో ఎంట్రీ టికెట్ ఉండదని జస్ట్ రూ.500 మాత్రమేనని చెప్పాడు. అసలు లక్షల్లో ఎంట్రీ టికెట్ కోసం ఎవడు ఖర్చు పెడతాడని కుర్చీ తాత ప్రశ్నించాడు. 5 వేలు పడేస్తే గంజాయి పొట్లాం, రూ.50 వేలు పెడితే రెండు ఇంజెక్షన్లు.. హైదరాబాద్‌లో తాను ఇప్పిస్తానంటూ పాషా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అబద్ధాలు చెప్పడానికైనా హద్దుండాలని, ఒక్కొక్కడికి కోస్తానని కుర్చీ తాత హెచ్చరించాడు. కరాటే కళ్యాణీ, హేమల మధ్య వివాదంపైనా అహ్మద్ పాషా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఎదుటి వ్యక్తి నచ్చాలని లేదని.. ఎదుటి వ్యక్తికి నేను నచ్చకపోవచ్చునని, ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయన్నాడు. సాధ్యమైనంత వరకు సాయం చేయాలని, లేదంటే ఓ మూల కూర్చోవాలని.. ఎవరివైపు వేలేత్తి చూపొద్దని సూచించాడు.


Click it and Unblock the Notifications











