RC15: రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి సోదరి.. ఊహించని పాత్రలో!

మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. అన్ని రంగాల్లోనూ రాణిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే అతడు RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేషనల్ రేంజ్‌లో సత్తా చాటుతోన్న దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో అతడు మరో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ మూవీతో అతడి క్రేజ్ జాతీయ స్థాయికి పెరిగిపోయింది. కానీ, 'ఆచార్య' మాత్రం గట్టి షాక్ ఇచ్చింది.

ఇక, తన గత చిత్రాల ఫలితాలను బేరీజు వేసుకోని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దిగ్గజ దర్శకుడు శంకర్‌తో కలిసి ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన 50 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే, త్వరలోనే ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్‌ను భాగాన్ని షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికోసం సెట్‌లను కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

Kushboo Key Role in Ram Charan Movie

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులో సీనియర్ హీరోయిన్ కుష్భూ కూడా భాగం అయినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆమె కోసం డైరెక్టర్ శంకర్ ఊహించని రోల్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇది కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. గతంలో కుష్బూ 'స్టాలిన్' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా నటించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రంలోనూ నటించారు.

ఈ భారీ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X