twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ రెమ్యూనరేషన్ బయటపెట్టిన ఐటీ శాఖ.. ఇకపై అయినా వదిలేస్తారా?.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

    |

    కోలీవుడ్ నాట గత దళపతి విజయ్ వ్యవహారం కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. విజయ్‌పై ఐటీ రైడ్స్, బిగిల్ చిత్ర నిర్మాతలు ఇంట్లో, కార్యాలయాల్లో దాడులు నిర్వహించడం, పోలీసు కేసులు, విజయ్ షూటింగ్ ప్రాంతానికి బీజేపీ కార్యకర్తలు రావడం, దళపతి ఫ్యాన్స్ రాకతో గొడవ జరగడం, మధ్యలో పోలీసులు ఇలా ఎన్నో రకాలు వార్తలు హల్చల్ చేశాయి. అన్నీ సద్దుమణిగాయని అనుకునే సమయంలో మరోసారి విజయ్‌పై ఐటీ రైడ్స్ వార్తలు వైరల్ కాసాగాయి.

    బిగిల్ సినిమా నేపథ్యంలో..

    బిగిల్ సినిమా నేపథ్యంలో..

    విజయ్ నటించిన బిగిల్ కోలీవుడ్‌లో రికార్డుల మోత మోగింది. అయితే ఈ మూవీ కలెక్షన్స్, లాభాల్లో నిర్మాత ప్రదర్శించిన అత్యుత్సాహం ఐటీశాఖ కన్నుపడేలా చేసింది. ఫిబ్రవరిలో దాదాపు 36 గంటలపాటు ఏకధాటిగా విజయ్ నివాసాలు, నిర్మాతల ఆఫీసులలో సోదాలు నిర్వహించారు.

    తాజాగా మరోసారి..

    తాజాగా మరోసారి..

    మొదటి సారి చేసిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం కూడా చర్చనీయాంశమైంది. నిర్మాతలు దాదాపు 70కోట్ల మేర లెక్కలు చూపించడంలో విఫలమైనట్టు వార్తలు వచ్చాయి. ఇక మార్చి 12వ తేదీన మరోసారి చెన్నైలో విజయ్ నివాసం పెన్నాయూర్ హౌస్‌కు, ఆఫీసులకు ఐటీ అధికారులు వెళ్లారనే వార్త మీడియాలో బ్రేకింగ్‌లకు దారి తీసింది.

    బిగిల్, మాస్టర్ సినిమాలకు

    ఐటీ దాడులకు సంబంధించి విజయ్‌కి క్లీన్ చీట్ ఇవ్వడంతో ఆయన తన తాజా సినిమాలకు ఎంత పుచ్చుకున్నాడన్న వివరాలను కూడా బహిర్గత పరిచారు.బిగిల్ సినిమాకు విజయ్ రూ.50 కోట్లు, మాస్టర్ సినిమాకు రూ.80 కోట్ల రూపాయలు తీసుకొన్నట్టు ఐటీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. విజయ్ తన రెమ్యునరేషన్‌కు తగినట్టుగా పన్నులు కట్టారని, దాంతో ఆయనపై కేసుల క్లోజ్ చేశామని అధికారులు పేర్కొన్నారు.

     ఇప్పటికైనా వదిలేస్తారా?

    ఇప్పటికైనా వదిలేస్తారా?

    విజయ్ రెమ్యూనరేషన్‌ను బయట పెట్టిన ఐటీ అధికారులపై కాంగ్రెస్ నేత, సీనియర్ నటి కుష్బూ సుందర్ ఫైర్ అయింది. ‘బిగిల్ సినిమాకు విజయ్ రూ.50 కోట్లు, మాస్టర్ సినిమాకు రూ.80 కోట్ల రూపాయలు తీసుకొన్నట్టు ఐటీ అధికారులు ప్రకటించారు. క్లీన్ చీట్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పటికైనా ఈ కేసు ముగిసినట్టేనా?' అంటూ అసహనం వ్యక్తం చేసింది.

    English summary
    Kushboo Sundar Fires On Income tax Department revealing Hero Vijay remuneration. Income tax Department raids on Hero Vijay Once again. In first week of February, IT raids went. IT dept has given clean chit for Vijay. IT department stated that.. Vijay has taken Rs 50 crores for Bigil, Rs.80 crores for Master.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X