Kushi Censor Review సెన్సార్ అధికారుల షాకింగ్ రిపోర్టు.. ఆ ఒక్కటి వర్కవుట్ హిట్ ఖాయమంటూ..!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల తార సమంత రుత్ ప్రభు నటించిన ఖుషి చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, పాటలు ఇప్పటికే రిలీజై ట్రెండింగ్‌గా నిలిచాయి. ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సెన్సార్ అధికారులు ఇటీవల వీక్షించారు. సెన్సార్ రిపోర్టు, సినిమా నిడివి, సినిమా గురించి వివరాల్లోకి వెళితే..
ఖుషి సినిమా పాటలు రిలీజై సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. నా రోజా నువ్వే, ఆరాధ్య, ఎదకు ఒక గాయం లాంటి పాటలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమా పాటలు రీల్స్, షార్ట్స్, రింగ్ టోన్ రూపంలో ట్రెండింగ్‌గా మారాయి. విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ పాటలను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఖుషి సినిమా రొమాంటిక్, వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కింది. ఈ సినిమాలో డ్రామా భావోద్వేగానికి గురిచేస్తుంది. సమంత, విజయ్ దేవరకొండ మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి అని సెన్సార్ అధికారులు వెల్లడించినట్టు సమాచారం. యూత్ నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పారు.

ఖుషి సినిమాను చూసిన సెన్సార్ బోర్డు అధికారులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాలో చాలా మంచి విషయాలను, దాంపత్య సంబంధింత అంశాలు, కుటుంబ విలువలు సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చేలా ఉన్నాయని సెన్సార్ అధికారుల నుంచి వచ్చిన రిపోర్ట్. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అధికారులు U/A సర్టిఫికెట్ అందజేశారు. ఎక్కువ కట్స్ లేకుండానే సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలిసింది. .

ఇక ఖుషి సినిమాలో కంటెంట్ బలంగా ఉండటంతో నిడివి కూడా భారీగా పెరిగింది. సాధారణంగా ఉండే సినిమా నిడివి కంటే 20 నిమిషాలు లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా మొత్తం నిడివి 165 నిమిషాలు. అంటే సుమారు 2 గంటల 45 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నది. కంటెంట్ మీద పూర్తిగా నమ్మకం ఉండటంతో లెంగ్త్ సమస్య కాదనే నమ్మకంతో యూనిట్ ఉన్నట్టు సమాచారం.

ఖుషి టీజర్లు, గ్లింప్స్, పాటలు, ట్రైలర్, ఇటీవల నిర్వహించిన ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్ విశేషమైన స్పందన రావడంతో సినిమాపై నిర్మాత, దర్శకులు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 1వ తేదీన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా కోసం రౌడీస్టార్, సమంత అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











