Kushi: రౌడీ కోసం రిస్క్ చేస్తున్న సమంత.. వాళ్లకు నష్టం జరగకూడదనే ఈ నిర్ణయం
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన రీతిలో అలరిస్తూ.. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సమంత రూత్ ప్రభు. 'ఏమాయ చేశావే' చిత్రంతో అందరినీ మాయ చేసిన ఈ భామ.. అప్పటి నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇలా దాదాపు పదేళ్లుగా సౌత్‌లోని ఇండస్ట్రీలో హల్‌చల్ చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆమె అనారోగ్యానికి గురి కావడంతో సినిమాల వేగం తగ్గించేసింది. అలాగే, ఆమె చేస్తున్న చిత్రాలకు కూడా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా ఆమె గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సమంత రూత్ ప్రభు ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తోన్న 'ఖుషి' మూవీలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తైంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. కానీ, కొంత కాలంగా సమంత డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంపై ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది.

సమంత రూత్ ప్రభు అనారోగ్యం కారణంగా 'ఖుషి' మూవీ షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆమె ఇప్పట్లో దీనికి డేట్స్ కేటాయించే పరిస్థితులు లేవని, దీంతో ఇది పున: ప్రారంభం అయ్యే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం కోసం ఆమె రంగంలోకి దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కొంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతుండడంతో ఆమె రిస్క్ తీసుకుంటుందని తెలిసింది. దీంతో ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ను మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు తాజాగా తెలిసింది.
ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్న 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు చేస్తోన్నారు.


Click it and Unblock the Notifications











