Kushi Pre Release Review ఎమోషనల్ లవ్ స్టోరిలో ట్విస్టు అదే.. ఖుషిలో హైలెట్ అంశాలు ఇవే..!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత కలిసి తొలిసారి నటించిన ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అమెరికాలో గురువారం భారత కాలమానం ప్రకారం 11 గంటలకు ప్రీమియర్స్ మొదలవుతాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని హైలెట్స్ మీ కోసం..

ప్రేమ.. పెళ్లికి మధ్య: పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత ఇద్దరి జీవితాల్లో చోటుచేసుకొనే సంఘటనల ఆధారంగా ప్రేమకథను తెరకెక్కించాం. ఎమోషన్స్, వినోదం మేలవించి మంచి మ్యూజికల్ మూవీగా తీసే ప్రయత్నం చేశాం. నేను తీసే ప్రతీ సినిమాలో నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తప్పకుండా ఉంటాయి. ప్రేమ, పెళ్లి అంశాలుగా సినిమా కథలు వేలాది వచ్చాయి. కానీ మేము ఎలా వినోదంగా చెప్పామనేది ఆసక్తికరమైన పాయింట్ అని దర్శకుడు శివ నిర్వాణ ఖుషి సినిమా కథపై క్లారిటీ ఇచ్చాడు.

Kushi Pre Release Review

మ్యూజికల్ హిట్‌తో ప్రేక్షకుల ముందుకు: ఖుషి సినిమాకు సంబంధించి రిలీజ్‌కు ముందు ఆడియో మ్యూజికల్ హిట్ అవ్వడంతో మూవీపై భారీగా క్రేజ్ పెరిగింది. నా రోజా నువ్వే పాట ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ సాధించడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఒక్క పాట హిట్ కాకుండా నాలుగైదు పాటలు ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్‌ ఆల్బమ్‌గా నిలవడం ఓ హైలెట్‌ మాత్రమే కాకుండా ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించే ప్రయత్నం చేస్తాయనే అభిప్రాయాన్ని నిర్మాతలు, చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

Kushi Pre Release Review

విప్లవ్‌గా విజయ్ దేవరకొండ: ఖుషి సినిమాలో విప్లవ్ అనే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తారు. విప్లవ్‌కు మణిరత్నం, కాశ్మీర్ అంటే చాలా ఇష్టం. మణిరత్నం సినిమాలను అమితంగా అభిమానిస్తాడు. కశ్మీర్‌ను చూడగానే రోజా సినిమా గుర్తుకు వస్తుంది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని నా రోజా నువ్వే పాటను కంపోజ్ చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరిగా ఉండబోతుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

Kushi Pre Release Review

ఆరాధ్యగా సమంత రుత్ ప్రభు: ఖుషి సినిమాలో ఆరాధ్య అనే బ్రహ్మణ యువతి పాత్రలో నటించారు. బ్రహ్మణ యువతికి, క్రిస్టియన్ అబ్బాయికి మధ్య జరిగే ప్రేమ కథ. పెళ్లి తర్వాత వారి మధ్య ఎందుకు కలతలు, అభిప్రాయ బేధాలు తలెత్తాయనేది మెయిన్ పాయింట్. విప్లవ్, ఆరాధ్య మధ్య విభేదాలకు పరిష్కారం ఏమిటనేది సినిమా కథ.

Kushi Pre Release Review

ఖుషి ప్రీ రిలీజ్ బిజినెస్: ఖుషి సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలకు సూపర్ హిట్ రెస్సాన్స్ రావడంతో రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిసి 41 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మూవీకి 53 కోట్ల రూపాయల బిజినెస్ నమోదైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని 54 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు.

Kushi Pre Release Review

రికార్డుస్థాయిలో టికెట్ల అమ్మకాలు: ఇక ఖుషీ సినిమాకు భారీ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోయాయి. బుక్ మై షో వెబ్ సైట్ ప్రకారం గురువారం సాయంత్రం వరకు దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా శుక్రవారం ఉదయానికి టికెట్ల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X