షాకింగ్: ఎంపురాన్‌పై పైరసీ దెబ్బ.. ఆన్‌లైన్‌లో ఫుల్ మూవీ లీక్!
లూసిఫర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం L2: ఎంపురాన్. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా రిలీజ్ తర్వాత మంచి హిట్ టాక్ సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ బారిన పడింది. దాంతో ఈ చిత్ర యూనిట్ వాటిని తొలగించేందుకు సిద్దమైనట్టు సమాచారం. ఈ లీకేజ్ వివరాల్లోకి వెళితే..
ఎంపురాన్ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్, గోకుళం మూవీస్ బ్యానర్లపై అంటోని పెరంబవూర్, గోకుళమ్ గోపాలన్ నిర్మించారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసవారు. కేరళలో 750 స్క్రీన్లకుపైగా విడుదల చేశారు. కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 750 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలకు తగినట్టుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఇండియాలో పలు ప్రాంతాల్లో విడుదలైనప్పటికీ..కేరళలో తొలి సినిమా ప్రదర్శన 6 గంటలకే మొదలైంది. ఈ సినిమాకు కేరళలో అనూహ్యమైన స్పందన లభించింది. అయితే ఈ మూవీకి ఊహించిన దెబ్బ కూడా అక్కడే జరిగింది. ఈ సినిమాను పైరసీదారులు గట్టి షాక్ ఇచ్చారు. విడుదలైన కొన్ని గంటలకే HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకైంది.
ఎంపురాన్ సినిమా ఆన్‌లైన్‌లో హెచ్డీ క్వాలిటీ ప్రింట్ లీక్ కావడం ఫ్యాన్స్‌ను కంగారు గురి చేసింది. మూవీ రిలీజైన వెంటనే టెలిగ్రామ్‌లో పలు ఛానెల్స్‌లో ఈ సినిమా ఫుల్ మూవీ కనిపించింది. అలాగే ఫైల్ జిల్లా, మూవీరూల్జ్, తమిళ్‌రాకర్స్ వెబ్‌సైట్స్‌లో లీకైనట్టు లింకులు కనిపించాయి. ఫుల్ మూవీని డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అవకాశం ఉండటంతో కొందరు నెటిజన్లు భారీగా వీక్షించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
అయితే ఎంపురాన్ సినిమా లీక్ అయిందనే విషయం తెలియగానే పైరసీ దెబ్బ నుంచి కోలుకోనేందుకు చర్యలు చేపట్టారు. చిత్ర యూనిట్ వెంటనే కంప్లైంట్ చేసి లింకులను తొలగించే ప్రయత్నాలు చేపట్టారు. అయితే ఇలాంటి పైరసీ చర్య వల్ల కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఎంపురాన్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ విడుదలైన ప్రతీ భాషలోను, ప్రతీ ప్రాంతంలోను రికార్డు ఒపెనింగ్స్ సాధించాయి. ఈ సినిమా తొలి రోజు 50 నుంచి 60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని సాక్ నిల్క్ వెల్లడించింది. అయితే ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తే ఇంకా ఎక్కువగానే వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











