L2E: Empuraan Trailer Review: L2E: ఎంపురాన్ ట్రైలర్ రివ్యూ.. దైవపుత్రుడే అన్యాయం.. అందుకే సైతాన్ సాయం!
మలయాళ సినిమా రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించిన చిత్రం L2E: ఎంపురాన్. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, స్టార్ యాక్టర్ అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్ నటిస్తున్నారు.
సోనియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 27వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ముంబైలో ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే...

మలయాళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మార్చి 27న రిలీజ్ చేస్తున్న 'L2E: ఎంపురాన్' చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ముంబైలోని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ థియేటర్ ఐనాక్స్ మెగాప్లెక్స్, ఇనార్బిట్ మాల్, మలాడ్, ముంబై వేదికలుగా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రైలర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..
దక్షిణాదిలో 2019 సంవత్సరంలో విడుదలైన సంచలన విజయం సాధించిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్‌గా ఎంపురాన్ రూపొందింది. మూడు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో ఇది రెండోవది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఫస్ట్ ఫార్ట్‌ను మించి ట్విస్టులు, టర్నులు, పొలిటికల్ స్ట్రాటెజీలు, కుట్రలు, కుతంత్రాలు కనిపించాయి. వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టే హీరోయిజంతో మోహన్ లాల్ తనదైన బాడీ లాంగ్వేజ్ లూసిఫర్ క్యారెక్టర్ యాటిట్యూడ్‌ను స్క్రీన్ పై అదరగొట్టాడనిపించేలా ఉంది అని ట్రైలర్ ద్వారా చెప్పడంలో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ సక్సెస్ అయ్యాడనిపించింది.

ఇక లూసిఫర్ కాపాడుతున్న రాజ్యాన్ని కంబలించడానికి దేశవిదేశాల్లోని శత్రువులందరూ ఏకమై యుద్దం చేయడానికి సిద్దమైతే చిత్ర కథానాయకుడు మోహన్ లాల్ ఏ విధంగా వారి కుట్రలను తిప్పికొట్టాడు? తన రాజ్యాన్ని, తనను నమ్ముకొన్న వారిని ఎలా రక్షించాడనేది ఈ సినిమా కథగా కనిపించింది. ఈ మూవీపై అంచనాలు పెంచడంలో ట్రైలర్ సఫలమైందనిపించింది.
ఇక L2E: ఎంపురాన్ చిత్రంలోని ట్రైలర్‌లో పొందుపరిచిన సన్నివేశాల్లోని డైలాగ్స్ తూటాల్లా పేలాయి. 'నా బిడ్డలు కారు నన్ను ఫాలో అయితే.. నన్ను ఫాలో అయినవాళ్లే నా బిడ్డలు', 'పి.కె.రాందాస్‌గారు మిగిల్చి వెళ్లిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా కూల్చాలని ప్రయత్నించింది నా ముందు నిల్చుని ఎదిరించిన శత్రువులు కాదు', 'మనదేశంలో రాజనీతి ఓ వ్యాపారం', 'మనుషుల ప్రాణాల కంటే ఓ రక్త సంబంధానికైనా విలువ ఉంటుందని నేను అనుకోవటం లేదు', 'స్టీఫెన్ ఎక్కడ?', 'అతని కళ్లు అన్నింటినీ చూస్తున్నాయి', 'దైవపుత్రుడే అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్‌ను కాకుండా ఎవర్ని సాయం అడగగలం', 'స్టీఫెన్ మళ్లీ తిరిగి వచ్చి నీ మనిషిని, దైవానికి ఆత్మలాంటి దేశాన్ని కాపాడుకో' అనే డైలాగ్స్ అభిమానులను, సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











