Ram Mandir: నయనతార క్షమాపణలు.. జైశ్రీరామ్ అంటూ లేఖ విడుదల

నయనతార.. ఎట్టకేలకు అన్నపూర్ణి చిత్ర వివాదంపై స్పందించింది. అన్నపూర్ణి చిత్రం వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక వర్గాన్ని కించపరుస్తూ సన్నివేశాలు ఉన్నాయంటూ.. ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఇక తాజాగా నయనతార ఓపెన్ లెటర్ రాసుకువచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

లేడీ సూపర్ స్టార్ గత ఏడాది పాన్ ఇండియా చిత్రం జవాన్ లో నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. మొదటి సారిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సక్సెస్ అయింది. షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ లో నటించిన ఈ భామ.. ఈ సినిమాతో సూపర్ హిట్టను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమాకు ముందే అన్నపూర్ణి అనే చిత్రంలో నటించింది.

Lady Superstar Nayanathara Apologies For Annapoorani Controversy Full Details Here

ఈ సినిమా తమిళంలో నేరుగా థియేటర్లలో రిలీజ్ అయి పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమా ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఈ సినిమాలో రాముడిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ.. పలువురు హిందూ పరిషత్ నేతలు కోర్టులో కేసు వేశారు. దీంతో నిర్మాణ సంస్థ జీ గ్రూప్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ఈ అంశంపై రియాక్ట్ అయింది. తమ ఓటీటీ వేదిక నుంచి అన్నపూరణి సినిమాను తొలిగించిస్తున్నట్లు ప్రకటించింది.

ఇక నెట్ ఫ్లిక్స్ తమ ఓటీటీ నుంచి అన్నపూర్ణి సినిమాను తొలగించింది. అయితే ఈ వ్యవహారంపై లేడీ సూపర్ స్టార్ నయనతార స్పందించింది. మనోభావాలు దెబ్బతీసి ఉంటే క్షమించమని అడిగింది. తాము కావాలని తప్పు చేయలేదని వెల్లడించింది. ఇక ఈ విషయంపై జై శ్రీరామ్ అంటూ సుదీర్ఘ లేఖను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. గత కొన్ని రోజులుగా తన సినిమా 'అన్నపూరణి' చర్చనీయాంశంగా మారిన విషయంపై బరువెక్కిన హృదయంతో, ఈ ప్రకటన చేస్తున్నానని వెల్లడించింది.

'అన్నపూరణి' చిత్రాన్ని కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే కాకుండా ప్రజల్లోకి మంచి ఆలోచనను తీసుకురావాలనే ప్రయత్నంగా చేశామని చెప్పుకువచ్చింది. దృఢ సంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చని చూపించేందుకు 'అన్నపూర్ణి' చిత్రాన్ని రూపొందించామని వివరించింది. మీ మనోభావాలను ఏ విధంగానైనా గాయపరిచి ఉంటే క్షమించండి అంటూ రాసుకువచ్చింది. అన్నపూర్ణి సినిమా అసలు ఉద్దేశం ఎవరి మనోభావాలు దెబ్బతీయడం కాదని తెలిపింది.

Lady Superstar Nayanathara Apologies For Annapoorani Controversy Full Details Here

తమకు తెలియకుండానే కొందరి మనసుల్ని గాయపరిచామనే విషయాన్ని నయనతార ఒప్పుకుంది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా వివాదాస్పదమవ్వడం బాధాకరమని వెల్లడించింది.. అన్ని మతాల్ని సమానంగా చూస్తూ, అన్ని ప్రార్థనా స్థలాల్ని సందర్శించే తను ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పని చేయలేదని రాసుకువచ్చింది.

అన్నపూరణి సినిమాలో బ్రాహ్మణ యువతిగా నటించింది నయనతార. ఓ సనాతన కుటుంబానికి చెందిన యువతి, చెఫ్ గా ఎలా ఎదిగిందనేది ఇందులో చూపించారు. అయితే బిర్యానీ చేస్తున్నప్పుడు ఓ బ్రాహ్మణ యువతి నమాజ్ చేయడం, నాన్-వెజ్ తినడం లాంటివి తీవ్ర అభ్యంతరాలకు దారితీశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X