పవన్ కల్యాణ్‌కు నా కొడుకు పిచ్చ ఫ్యాన్.. నాకు ఆ హీరో ఇష్టం.. లగడపాటి రాజగోపాల్ సెన్సేషనల్ కామెంట్స్

బెజవాడ రాజకీయాల్లోకి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రీ ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తున్నది. విజయవాడలో తాజా ఎంపీ కేశినేని నాని టీడీపీపై తిరుగుబాటు జెండాను ఎగురవేసిన నేపథ్యంలో లగడపాటి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. అయితే తాజాగా పలు మీడియా ఛానెల్స్‌తో లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి తన అభిప్రాయాలను వెల్లడిస్తూ..

గత పదేళ్లుగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై పూర్తిగా అవగాహన లేదు. ప్రస్తుతం అన్ని పార్టీలకు దూరంగా ఉంటున్నాను. పూర్తిగా నేను ఢిల్లీకే పరిమితమయ్యాను. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు, గెలుపు ఓటములపై నాకు పూర్తిగా అవగాహన లేదు అని లగడపాటి రాజగోపాల్ అన్నారు.

 Lagadapati Raja Gopal

గత ఎన్నికల్లో నేను ఓ పార్టీ కోసం పరోక్షంగా పనిచేశాను. సర్వేల విషయంలో ఆ పార్టీకి సహకరించాను. అంతేగానీ నేను ఆ పార్టీకి అనుబంధంగా పనిచేయలేదు. తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచన లేదు. ఆ పార్టీ వారితో నాకు బంధుత్వాలు ఉన్నా.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే నేను ప్రయాణం సాగించాను. కుల రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను అని లగడపాటి తెలిపారు.

సినిమాల విషయానికి వస్తే.. నేను మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిని. ఆయన నటన, డ్యాన్సులంటే ఇష్టం. నేను పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్ కాదు. వ్యక్తిగతంగా ఆయనను ఇష్టపడుతాను. అన్ని కులాల వారు సినిమా నటులను అభిమానిస్తారు. అభిమానానికి కులం బేస్ కాదు. ప్రతీ హీరోకు అన్ని కులాల అభిమానులు ఉంటారు అని లగడపాటి అన్నారు.

నేను పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్ కాదు. మొదట నేను ఎన్టీఆర్‌కు ఫ్యాన్‌ను. ఆ తర్వాత చిరంజీవిని ఇష్టపడ్డాను. నేను కుల చూసి ఫ్యాన్‌ను కాదు. మా రెండో అబ్బాయి పవన్ కల్యాణ్‌కు పిచ్చ ఫ్యాన్. నా కొడుకు గది నిండా పవన్ కల్యాణ్ ఫోటోలు ఉంటాయి. నా ఫోటో ఒకటి పెట్టుకోమని అడిగితే.. నో అంటూ నా కొడుకు సమాధానం ఇస్తాడు అని లగడపాటి తెలిపారు.

 Lagadapati Raja Gopal

చిరంజీవికి బ్రదర్‌గా, మంచి పాపులారిటీ ఉన్న హీరోగా పవన్ కల్యాణ్‌కు ఇమేజ్ ఉంది. కాబట్టి అన్ని కులాల వారు ఆయనను అభిమానిస్తారు. కానీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు అందరూ ఓట్లు వేస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే. ఎవరూ కూడా కచ్చితంగా చెప్పలేరు. పార్టీలు వేరు.. హీరోలపై అభిమానం వేరు అని లగడపాటి అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X