టాలీవుడ్‌లోకి మరో వారసుడు.. లగడపాటి కుటుంబం నుంచి!
రేసు గుర్రం , నా పేరు సూర్య సినిమాలలో లక్కీ , అన్వర్ పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ మరో విభిన్నమైన పాత్రలొ నటిస్తున్నాడు. "ఎవడు తక్కువకాదు " అనే టైటిల్ తో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తొన్న ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. "ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్ " అన్న లైన్ ను బేస్ చెసుకుని రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష సమర్పణలో సగర్వంగా ఈ న్యూ ఏజ్ రివెంజ్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

బాల నటుడిగా ఆకట్టుకున్న మా విక్రమ్ సహిదేవ్, ఈ సినిమా కథకు తగ్గట్టుగా ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. టీమ్ వర్క్ యెుక్క పవర్‌ను చూపించే టీనేజ్ లవ్ స్టొరీ ఇది.
చిత్రీకరణ పూర్తయింది. హోళీ సందర్బంగా చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తున్నాం. ది బెస్ట్ టీమ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. మా బ్యానర్‌లో ఇది ఓ మంచి సినిమాగా నిలవటంతో పాటు, విక్రమ్ కు హీరోగా గుడ్ బిగినింగ్ అవుతుందని లగడపాటి శ్రీధర్ అన్నారు.


Click it and Unblock the Notifications











