చివరికి మిగిలేది బ్లడ్ రిలేషనే... గొడవను పెంచుకోవద్దు.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన మంచు ఫ్యామిలీలో గొడవలు ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశాయి. మంచు మోహన్ బాబు కుమారులు విష్ణు - మనోజ్‌ల మధ్య విభేదాలు చోటు చేసుకోవడం... మోహన్ బాబు ఏకంగా మనోజ్‌పై కేసు పెట్టడం, వారి నివాసంలో ప్రతినిత్యం హంగామా చోటు చేసుకోవడంతో మంచు అభిమానులు, సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారుపేరైన మోహన్‌బాబును ఈ పరిణామాలు బాగా కృంగదీశాయి. వారి కుటుంబంలో పరిస్ధితులు చక్కబడాలని తెలుగు ప్రజలు కోరుకున్నారు.
ఇంట్లో గొడవల సమయంలో ఓ విలేకరిపై మోహన్‌బాబు దురుసు ప్రవర్తన, సదరు విలేకరి గాయపడం వివాదానికి దారి తీసింది. విలేకరి చేతిలోని మైక్‌ను లాక్కొని విసిరేశారు మోహన్‌బాబు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విలేకరి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. గొడవ సద్దుమణిగిన తర్వాత కుమారుడు విష్ణుతో కలిసి హాస్పిటల్‌కు వెళ్లి ఆ విలేకరిని పరామర్శించి క్షమాపణలు చెప్పారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పారు కలెక్షన్ కింగ్.

తన కుటుంబంలోని గొడవలపై మోహన్‌బాబు స్పందించారు. కుటుంబం అన్నాక గొడవలు సహజమని, వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. ఆ తర్వాత పరిస్దితులు వేగంగా మారిపోయాయి. మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రాన్ని వీక్షించిన మనోజ్ ఆ సినిమాను మెచ్చుకున్నారు. తన అన్నయ్య బాగా నటించారని ప్రశంసించారు. ఆ తర్వాత మిరాయ్ చిత్రంలో మనోజ్ నటనను మెచ్చుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు విష్ణు. దానికి థ్యాంక్యూ అంటూ రిప్లయ్ ఇచ్చాడు మనోజ్. దాంతో అన్నదమ్ములిద్దరూ కలిసిపోయారని, మంచు ఫ్యామిలీ తిరిగి ఒక్కటైందని సినీజనులు సంబరపడ్డారు.
అయితే కుటుంబంలో పరిస్ధితులు ఇలా ఉంటే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ఎక్కడా కనిపించకపోవడంతో ఆమెపై ట్రోలింగ్ జరిగింది. దీనికి ఆమె అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. తన బాధ వీళ్లెవ్వరికీ తెలియదని మండిపడ్డారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కుటుంబంలోని గొడవలపై కీలక వ్యాఖ్యలు చేశారు మంచు లక్ష్మీ. ఈ వివరాల్లోకి వెళితే...
దేవుడు ఒక వరం ఇస్తే మీరు ఏం కోరుకుంటారని యాంకర్ ప్రశ్నించగా.. నా ఫ్యామిలీ అంతా తిరిగి కలిసిపోవాలి. అన్ని ఫ్యామిలీలలో ఏదో ఒకటి జరిగేదే.. అయినప్పటికీ చివరికి అందరూ కలిసిపోయేందుకు పోరాడాలి. మనదేశంలోని కుటుంబాల్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవలు జరిగితే.. జీవితాంతం కలవకూడదని అనుకుంటారు. కానీ చివరికి బ్లడ్ రిలేషన్ మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతుందని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీతో కలిసిపోయేందుకు ఎన్ని దారులు ఉంటాయో అన్నింటిని వినియోగించుకోవాలి, అంతే తప్పించి గ్యాప్ ఇంకా పెంచకూడదు అని మంచు లక్ష్మీ తెలిపారు.
బాంబేలో ఉంటున్నందున ఇక్కడేం జరిగినా నేను బాధపడలేదు, పట్టించుకోలేదని కథనాలు వచ్చాయి. అయితే నేను ఎంత మానసిక వేదన, బాధను అనుభవించానో నాకొక్కదానికే తెలుసు. అయినప్పటికీ ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. జీవితంలో ఇలాంటివి చూస్తానని, ఇలాంటి విభేదాలు వస్తాయని అస్సలు అనుకోలేదు. నా ఫ్యామిలీ గురించి ఏమనుకుంటున్నానో బయటి వాళ్లకి చెప్పాల్సిన అవసరం లేదు. దురదృష్టంకొద్దీ జరిగింది.. నా కూతురు జెన్ జెడ్, జెన్ గామా కాదు, జెన్ ఆల్ఫా. సక్సెస్ అనేది ఓవర్‌నైట్ రాదు.. నేర్చుకోవాలి, సాధన చేయాలని మంచు లక్ష్మీ తెలిపారు.


Click it and Unblock the Notifications











