తన గురించి తానే ధైర్యంగా ఒప్పుకున్న మంచు లక్ష్మి.. అతన్ని చూపిస్తూ!
Recommended Video
మంచు లక్ష్మి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాల ద్వారా పెద్ద పాపులారిటీ రాకున్నా.. మంచు వారి వారసురాలిగా తన వెరైటీ స్లాగ్ ఆఫ్ టాకింగ్ తో అట్రాక్ట్ చేస్తుంటుంది మంచు లక్ష్మి. అందుకే ఆమెకు టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇదిలా ఉంచితే తాజాగా మాటలతోనే కాదు ట్వీట్లతో కూడా అట్రాక్ట్ చేసే సత్తా ఉందని చెప్పకనే చెప్పింది మంచు లక్ష్మి. కాకపోతే తనపై తానే సెటైర్ వేసుకొని ఆకర్షించింది. ఇంతకీ ఆమె పెట్టిన ట్వీట్ ఏంటి? అందులో ఏముంది.. వివరాల్లోకి పోతే..

ఓ అమెరికన్ వీడియో పోస్ట్ చేస్తూ
ఓ అమెరికన్ తెలుగులో మాట్లాడుతున్న వీడియోను పోస్ట్ చేసిన మంచు లక్ష్మి.. అతను తనకంటే తెలుగు బాగా మాట్లాడుతున్నాడని పేర్కొంది. మన తెలుగు భాషను ఇలా మాట్లాడుతుండటం హృదయాన్ని హత్తుకుంటుంటోంది అని ట్యాగ్ చేసింది మంచు లక్ష్మి. దీంతో ఈ పోస్ట్ చూసి తనపై తానే సెటైర్ వేసుకుంది.. మంచు వారి అమ్మాయి గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
ఈ వీడియోలో వ్యక్తి ఎవరు..?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రిచర్డ్ ఇసాక్. తెలుగు భాషలో అనర్గళంగా మాట్లాడుతూ ఆకట్టుకుంటున్న ఆయన.. అంతా తనను న్యూజిలాండ్ వాడు అనుకుంటున్నారని, కాదు అమెరికన్ ని అని చెప్పాడు. 2016-18 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నానని, అప్పుడే తెలుగు నేర్చుకున్నానని ఆయన చెప్తున్నాడు.

అమెరికా వెళ్ళాక కూడా తెలుగే
అయితే ఆ తర్వాత తన దేశం అమెరికా వెళ్ళాక కూడా తెలుగే మాట్లాడే వాడినని ఆయన అన్నాడు. ఓ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో పని చేస్తున్న తాను అక్కడికి వస్తున్న తెలుగు వాళ్లతో తెలుగులోనే మాట్లాడుతున్నానని, తనకు తెలుగు అంటే భలే ఇష్టం అని అంటున్నాడు. అలా మాట్లాడుతుండగా ఒక అమ్మాయి షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టిందని ఆయన అన్నాడు.

అతన్ని చూపిస్తూ మంచు లక్ష్మి అలా అనడంతో
సాధారణంగా మంచు లక్ష్మి మాట్లాడే తెలుగు భాషకు సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. అమెరికన్ యాసెంట్ తెలుగులో మాట్లాడుతుంది లక్ష్మి. ఇది కొందరికి నచ్చుతుంది.. మరికొందరికి నచ్చదు. అలాంటి ఆమెనే స్వయంగా తన కంటే తెలుగు బాగా మాట్లాడుతున్నాడని పేర్కొంటూ ఓ అమెరికన్ పర్సన్ ని చూపించడం భిన్న వాదనలకు దారి తీస్తోంది.


Click it and Unblock the Notifications











