Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యమా హాట్‌గా మంచు లక్ష్మి మెసేజ్.. దానర్థం అదేనా..?
మంచు మోహన్ బాబు కుమార్తెగా, నటిగా మంచు లక్ష్మికి మంచి పాపులారిటీ ఉంది. ఓ వైపు సినిమా చేస్తూ, నిర్మిస్తూ టెలివిజన్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచు లక్ష్మి హంగామా ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియా విషయానికొస్తే.. ఇక్కడా ఆమె బాగా స్పీడే. ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టేస్తూ మంచు అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
స్వయంగా తన పిక్నే షేర్ చేసిన మంచు అక్క.. కాస్త హాట్ గానే ఫోజిచ్చింది. షర్ట్ జారిపోతుందో లేక కావాలనే ఈ స్టిల్ ఇచ్చిందో తెలియదు గానీ తనలోనూ మంట పుట్టించే గ్లామర్ ఉందని చెప్పకనే చెప్పింది. మాటల్లో, చేష్టల్లో ప్రత్యేకత చూపే ఈమె ఈ పోస్ట్‌పై ఇచ్చిన కొటేషన్ లోనూ అది కంటిన్యూ చేసింది. 'పొద్దు తిరుగుడు పువ్వు అవ్వండి.. మీ లోని వెలుగును బయటకు తీయండి' అంటూ గొప్ప సందేశాత్మక మెసేజ్ పెట్టింది. అయితే దీనిని అర్థం చేసుకోవడంలో మాత్రం నెటిజన్లు తడబడుతున్నారు. ఇంతకీ ఆమె తన లోనూ సెగలు రేపే సౌందర్యం దాగి ఉందని చెప్పుకుంటోందా? లేక ఇంకేదైనా సందేశం ఇస్తుందా? అని తికమక పడుతున్నారు.
డెనిమ్ షర్టు వేసుకొని అల్ట్రా స్టైలిష్ గా ఫోజిస్తూ మంచు లక్ష్మి పెట్టిన ఈ పోస్ట్ చాలా అర్థాలున్నాయని అంటున్నారు కొందరు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయాన్ని ఉద్దేశిస్తూనే లక్ష్మి ఈ రకమైన మెసేజ్ పెట్టిందని అంటున్నారు. ఏదేమైనా గ్లామర్ లుక్ లో మంచి లక్ష్మి ఫోటో, ఆమె పెట్టిన సందేశం రెండూ బాగా వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై ''అక్కా నువ్ సూపర్, బ్యూటిఫుల్ లుక్'' అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
View this post on InstagramBe a sunflower.. find your light. Being blue Photo: @sashajairam
A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on