twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యమా హాట్‌గా మంచు లక్ష్మి మెసేజ్.. దానర్థం అదేనా..?

    |

    మంచు మోహన్ బాబు కుమార్తెగా, నటిగా మంచు లక్ష్మికి మంచి పాపులారిటీ ఉంది. ఓ వైపు సినిమా చేస్తూ, నిర్మిస్తూ టెలివిజన్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచు లక్ష్మి హంగామా ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియా విషయానికొస్తే.. ఇక్కడా ఆమె బాగా స్పీడే. ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టేస్తూ మంచు అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

    స్వయంగా తన పిక్‌నే షేర్ చేసిన మంచు అక్క.. కాస్త హాట్ గానే ఫోజిచ్చింది. షర్ట్ జారిపోతుందో లేక కావాలనే ఈ స్టిల్ ఇచ్చిందో తెలియదు గానీ తనలోనూ మంట పుట్టించే గ్లామర్ ఉందని చెప్పకనే చెప్పింది. మాటల్లో, చేష్టల్లో ప్రత్యేకత చూపే ఈమె ఈ పోస్ట్‌పై ఇచ్చిన కొటేషన్ లోనూ అది కంటిన్యూ చేసింది. 'పొద్దు తిరుగుడు పువ్వు అవ్వండి.. మీ లోని వెలుగును బయటకు తీయండి' అంటూ గొప్ప సందేశాత్మక మెసేజ్ పెట్టింది. అయితే దీనిని అర్థం చేసుకోవడంలో మాత్రం నెటిజన్లు తడబడుతున్నారు. ఇంతకీ ఆమె తన లోనూ సెగలు రేపే సౌందర్యం దాగి ఉందని చెప్పుకుంటోందా? లేక ఇంకేదైనా సందేశం ఇస్తుందా? అని తికమక పడుతున్నారు.

    Lakshmi Manchu posted her hot photo

    డెనిమ్ షర్టు వేసుకొని అల్ట్రా స్టైలిష్ గా ఫోజిస్తూ మంచు లక్ష్మి పెట్టిన ఈ పోస్ట్ చాలా అర్థాలున్నాయని అంటున్నారు కొందరు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయాన్ని ఉద్దేశిస్తూనే లక్ష్మి ఈ రకమైన మెసేజ్ పెట్టిందని అంటున్నారు. ఏదేమైనా గ్లామర్ లుక్ లో మంచి లక్ష్మి ఫోటో, ఆమె పెట్టిన సందేశం రెండూ బాగా వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై ''అక్కా నువ్ సూపర్, బ్యూటిఫుల్ లుక్'' అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

    English summary
    Lakshmi Manchu posted her hot photo in instagram. And she gave messege to netijans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X