జూనియర్ ఎన్టీఆర్‌పై లక్ష్మిపార్వతి కామెంట్స్.. లోకేష్‌తో పోల్చుతూ సంచలనం

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై లక్ష్మిపార్వతి చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ భవితవ్యం ఏంటి? రానున్న రోజుల్లో ఆ పార్టీ రథసారధి ఎవరు కానున్నారనే అంశం గత కొంతకాలంగా జనం నోళ్ళలో నానుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే విషయమై నారా లోకేష్‌తో పోల్చుతూ జూనియర్ ఎన్టీఆర్‌పై లక్ష్మిపార్వతి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

టీడీపీ వర్గాలు షాకయ్యేలా.. రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా

టీడీపీ వర్గాలు షాకయ్యేలా.. రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలు కావడం ఆ పార్టీ వర్గాలకు షాకిచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్ పై పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీకి ఓ యువ నాయకుడి అవసరం ఉందని, అది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అనే కోణంలో చర్చలు ముదిరాయి. ఇదే అంశంపై రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు కూడా స్పందించడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.

వల్లభనేని వంశీ సైతం అదే మాట

వల్లభనేని వంశీ సైతం అదే మాట

ఈ పరిస్థితుల్లో ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్‌కు నారా లోకేష్ బయపడుతున్నారని, అందుకే.. ఆయన్ని పార్టీ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వంశీ. ఎన్టీఆర్ చేతిలో పడితే తప్ప తెలుగుదేశం పార్టీ గాడిలో పడదని ఆయన వ్యాఖ్యానించారు.

తాజాగా లక్ష్మిపార్వతి సంచలనం

తాజాగా లక్ష్మిపార్వతి సంచలనం

దీంతో ఇదే అంశంపై తాజాగా జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో లక్ష్మిపార్వతికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. నారా లోకేష్ కంటే ఎన్టీఆర్ చాలా బెటర్. ఎటు లేదన్న 100 రెట్లు బెటర్ పర్సన్ అనేసింది లక్ష్మిపార్వతి.

జూనియర్ ఎన్టీఆర్ క్వాలిటీస్

జూనియర్ ఎన్టీఆర్ క్వాలిటీస్

జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ప్రజలను మెప్పించగలిగే నటనా చాతుర్యంతో పాటు మంచి వాక్ చాతుర్యం కూడా ఉందని చెప్పింది లక్ష్మిపార్వతి. సబ్జెక్టు మీద అతనికి కమాండ్ ఉంది. ఒక పర్ఫెక్ట్‌నెస్ ఉంది. ఇలా లోకేష్ కంటే ఎన్టీఆర్ లో ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయని తెలిపింది. లోకేష్ ఏదీ లేదు కదా.. రాసిచ్చేది ఒకటి ఇతను చెప్పేది ఒకటి అని సంచలన కామెంట్స్ చేసింది లక్ష్మిపార్వతి.

మళ్ళీ మళ్ళీ ఇదే అంశం.. ఇంతకీ ఏం జరుగుతోంది?

మళ్ళీ మళ్ళీ ఇదే అంశం.. ఇంతకీ ఏం జరుగుతోంది?

నిజానికి గతంలో 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ తరఫున ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో క్రమంగా పార్టీకి దూరంగా ఉంటూ సినిమాల్లో రాణిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ టీడీపీ వంక చూడరనుకున్న తరుణంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ ఎంట్రీ అంశం చర్చనీయాంశం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Recommended Video

#CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !
RRRలో ఎన్టీఆర్..

RRRలో ఎన్టీఆర్..

తనపై ఎన్నిరకాల ప్రచారాలు వచ్చినా ఎన్టీఆర్ మాత్రం ఇలాంటి వాటిపై స్పందించడం లేదు. తన సినిమాలతో బిజీగా ఉంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన RRR షూటింగ్ లో పాల్గొంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఈ భారీ సినిమా తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X