హరికృష్ణ మరణానికి కారణం చంద్రబాబే.. అందుకే ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాట్లాడరు.. లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య సంఘటనకు రాజకీయ రంగు పులుముకొంటున్నది. ఇప్పటికే ఆమె మరణంపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ మరణం వెనుక అసలు కారణం ఏమిటనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉమామహేశ్వరి మరణం వెనుక చంద్రబాబు, ఆయన కుమారుడు హస్తం ఉందనే ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి ఘాటుగా స్పందించారు. లక్ష్మీ పార్వతి చేసిన ఆరోపణల వివరాల్లోకి వెళితే..

చంద్రబాబు లేఖ రాయాలి

చంద్రబాబు లేఖ రాయాలి


ఎన్టీ రామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి సూసైడ్ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి. ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమని నా అనుమానం. కాబట్టి సీబీఐ దర్యాప్తు కోరుతూ బాబు లేఖ రాయాలి. చంద్రబాబు లేఖ రాయకపోతే నేనే స్వయంగా రాస్తాను. ఆస్తి కోసం ఉమా మహేశ్వరితో బాబు, లోకేష్‌ గొడవ పడుతున్నారనే విషయం బయటకు వచ్చింది అని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి మీడియాలో పేర్కొన్నారు.

Recommended Video

బాక్స్ ఆఫీస్ యుద్ధం లో బింబిసారుడు గెలిచాడా లేదా *Reviews | Telugu OneIndia
పిరికితనం ఆమెకు లేదు..

పిరికితనం ఆమెకు లేదు..


నాకు తెలిసినంత వరకు ఉమామహేశ్వరి ఎంతో ధైర్యవంతురాలు, విద్యావంతురాలు. ఆమె అంత సులభంగా సూసైడ్ చేసుకొనే వ్యక్తి కాదు. ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం ఎన్టీఆర్‌ కుటుంబంలోనే లేదు అని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్‌ చిన్న కూతురు సూసైడ్ ఓ మిస్టరీలా ఉందంటూ సోషల్‌ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి అని లక్ష్మీపార్వతి అన్నారు.

 హరికృష్ణ మరణానికి కారణం

హరికృష్ణ మరణానికి కారణం


ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ మరణానికీ పరోక్షంగా చంద్రబాబే కారణం అని నందమూరి కుటుంబం భావిస్తుంది. అందుకే చంద్రబాబుతో జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ ఆయనతో మాట్లాడటం లేదు. ఎన్టీఆర్‌ కుటుంబంలోకి చంద్రబాబు శనిలా ప్రవేశించారు. నందమూరి కుటుంబంలోని ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్నారు. చంద్రబాబు వెంటనే ఎన్టీఆర్‌ కుటుంబాన్ని విడిచిపెట్టాలి అని లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు.

 ఎన్టీఆర్‌ను రాజకీయంగా వాడుకొని

ఎన్టీఆర్‌ను రాజకీయంగా వాడుకొని


నందమూరి కుటుంబాన్ని, జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం వినియోగించుకున్నాడు. ఆ తర్వాత తన కొడుకు లోకేష్‌ కోసం అదే జూనియర్‌ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీకి దూరం చేశాడు. చివరకు ఎన్టీఆర్ సినిమాలు ఆడకుండా కూడా అడ్డుపడ్డాడు అని లక్ష్మీపార్వతి విమర్శించారు.

 లక్షల కోట్లు సంపాదించుకొన్నారంటూ

లక్షల కోట్లు సంపాదించుకొన్నారంటూ


ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన దుర్మార్గుడు చంద్రబాబు. తన రాజకీయ స్వార్ధం కోసం ఎన్టీఆర్ పేరును చంద్రబాబు వాడుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ పేరుతో లక్షల కోట్ల రూపాయల సంపాదించుకొన్నారు అని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఉమామహేశ్వరి మరణంపై లక్ష్మీ పార్వతి చేస్తున్న ఆరోపణలు మీడియాలో సంచలనంగా మారాయి. ఉమామహేశ్వరి ఆగస్టు 1వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం సంచలనం రేపింది. ఆమె అంత్యక్రియలు ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ముగిసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X