twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "నా తారక రాముడికి అవమానం చేశారు... లక్ష్మీ పార్వతి చెప్పిన వ్యక్తి జూ ఎన్టీఆరేనా?

    |

    మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి(మే 28) సందర్భంగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ ప్రతి ఏటా సర్వాంగ సుందరంగా ముస్తాబావుతుంది. అయితే 96వ జయంత్రి సందర్భంగా ఘాట్ బోసి పోయింది. ఘాట్ ప్రాంగణం ఎలాంటి అలంకరణ లేకుండా నిర్జీవంగా కనిపించింది.

    ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ భవన్ కార్యాలయం.... మూలపురుషుడు రామారావును మరిచిపోయిందని, అందుకే ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా వదిలేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    నా తారక రాముడికి అవమానం చేశారు

    నా తారక రాముడికి అవమానం చేశారు

    ఘాట్ వద్దకు వచ్చిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పర్వతి స్పందిస్తూ.... ఇన్నాళ్లు ఓట్ల కోసం ఎన్టీఆర్ ఫోటో వాడుకున్న చంద్రబాబు ఇపుడు ఓడిపోవడంతో ఘాట్‌ను పట్టించుకోవడం మానేశారని, ఒక్క బేనర్ కూడా కట్టలేదని, విమర్శలు రావడంతో అలంకరణ ఏర్పాట్లు ఇపుడు తూతూ మంత్రంగా చేశారని, నా తారక రాముడికి అవమానం జరిగినట్లు ఫీలవుతున్నట్లు తెలిపారు.

    ఓ 10 లక్షలు ఖర్చు పెట్టలేరా?

    ఓ 10 లక్షలు ఖర్చు పెట్టలేరా?

    ఎన్టీ రామారావుగారి నుంచి పార్టీని, అధికారాన్ని లాక్కున్నారు. ఆయన పేరు చెప్పుకుని ఎంతో సంపాదించారు. చంద్రబాబుకు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్య లేదా? ఓ 10 లక్షలు ఖర్చు పెట్టి ఘాట్ వద్ద ఏర్పాట్లు చేయలేరా? అంటూ లక్ష్మీ పార్వతి మండి పడ్డారు.

    వారికి మాత్రమే వ్యతిరేకం, పార్టీకి కాదు

    వారికి మాత్రమే వ్యతిరేకం, పార్టీకి కాదు

    తెలుగు దేశం పార్టీకి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ఆ పార్టీని చేతుల్లోకి తీసుకుని పార్టీని భ్రష్ఠుపట్టించిన వ్యక్తికి మాత్రమే తాను వ్యతిరేకిని అని లక్ష్మీ పార్వతి అన్నారు. రామారావు అంతటి నాయకుడు మళ్లీ వచ్చినపుడే తెలుగు దేశం పార్టీ జీవం పోసుకుంటుందన్నారు.

    కక్ష తీర్చుకున్నారు, స్వర్గంలో హ్యాపీగా...

    కక్ష తీర్చుకున్నారు, స్వర్గంలో హ్యాపీగా...

    ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడం ద్వారా ఎన్టీఆర్ గారు కక్ష తీర్చుకున్నారని, ఇపుడు ఆయన ఆత్మ స్వర్గంలో ఎంతో సంతోషంగా ఉంటుందని లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పుదు... ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు.

    లక్ష్మీ పార్వతి చెప్పిన వ్యక్తి జూ ఎన్టీఆరేనా?

    లక్ష్మీ పార్వతి చెప్పిన వ్యక్తి జూ ఎన్టీఆరేనా?

    రామారావు అంతటి నాయకుడు మళ్లీ వచ్చినపుడే తెలుగు దేశం పార్టీ జీవం పోసుకుంటుందని లక్ష్మి పార్వతి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. ఆ అర్హత, సత్తా ఉన్న వ్యక్తి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మాత్రమే అనే అభిప్రాయాలు మెజారిటీ ప్రజలు, అభిమానుల నుంచి వ్యక్తం అవుతోంది.

    English summary
    Lakshmi Parvathi Shocking Comments at Ntr Ghat. Lakshmi Parvathi Slams Chandrababu About NTR Ghat Decoration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X