ఎన్టీఆర్ అంతా రొమాంటిక్ కాదు.. ఆ హీరోయిన్లపై అలాంటి ఫీలింగ్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సినిమానే ప్రపంచంగా భావిస్తూ పూర్తిగా ఫ్యామీలికే సమయాన్నికేటాయిస్తాడనేది అభిమానుల్లోను,మీడియాలోను ఓ ఇమేజ్ మాత్రం ఉంది. షూటింగులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ తాను లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు.అవసరమైతే తప్పా బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోరు. అలాంటి ఫ్యామిలీ మ్యాన్ గురించి భార్య ప్రణీత ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ గురించి ఆమె చెప్పిన విషయాల్లోకి, ఎన్టీఆర్ ఫ్యామిలీ వివరాల్లోకి వెళితే..
బాల రామాయణంతో అద్బుతమైన నటనను ప్రదర్శించి.. స్టూడెంట్ నంబర్ 1తో హీరోగా మారిన ఎన్టీఆర్ తన టీనేజ్‌లోనే ఎవరూ సాధించనటువంటి ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నారు. అప్పటి నుంచి మధ్యలో చిన్న తడబాటుకు గురైన ఆయన కెరీర్ ఆ తర్వాత వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి కనిపించలేదు. కెరీర్ పరంగా మంచి స్థాయిలో ఉండగానే పెద్దలు కుదర్చిన పెళ్లితో ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు.

చంద్రబాబు సమీప బంధువుల అమ్మాయి ప్రణతితో ఎన్టీఆర్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. వారి దాంపత్యం జీవితం అన్యోన్యంగా సాగుతూ ముందుకు వెళ్లున్నది. ఎన్టీఆర్ కెరీర్‌కు, ప్రొఫెషనల్ లైఫ్‌లోను ఆమె భాగస్వామిగా నిలిచారని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తుంటారు. ఎన్టీఆర్ కూడా షూటింగులు, ఇతర ఈవెంట్స్ లేకపోతే చక్కగా పిల్లలు, ఫ్యామిలీతో సెటిల్ అయిపోతారు.
ఎన్టీఆర్, ప్రణీత దాంపత్య జీవితం చక్కగా సాగుతుండగానే వారిద్దరికి ఇద్దరు మగ పిల్లల సంతానం కలిగింది. ఎన్టీఆర్‌కు తన పిల్లలంటే ఎంతో ముద్దు. తమ కుమారుల గురించి పలు సందర్భాల్లో తండ్రిగా తన భావాలను వెల్లడించడం తెలిసిందే. ఖాళీ సమయాల్లో ఎన్టీఆర్ తన పిల్లలతో కలిసి చిన్న పిల్లాడిలా మారిపోతారని స్నేహితులు చెప్పుకోవడం తెలిసిందే..
అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీ ప్రణతి తన భర్త ఎన్టీఆర్ గురించి ప్రశంసలతో ముంచెత్తింది. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. తెర మీద హీరోయిన్లతో మంచి కెమిస్ట్రీ ఉంటుంది. నిజ జీవితం విషయానికి వస్తే సినిమాల్లో అంత రొమాంటిక్ పర్సన్ కాదు అని చెప్పారు. అలాగే ఆయన ఇతర హీరోయిన్ల గురించి చెప్పిన విషయాలను కూడా షేర్ చేసుకొన్నారు.
సినిమా హీరోయిన్ల గురించి ఆయనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. శ్రీదేవీ అంటే ఆయనకు చాలా ఇష్టం. భూమ్మీద అంత అందమైన తార ఉండదని చెబుతారు. అలాగే తనతో నటించిన హీరోయిన్ల గురించి కొన్ని ఫన్నీ విషయాలు వెల్లడించారు. సమీరా రెడ్డి చాలా వాగుడు కాయ అని చెప్పారని ఆమె వెల్లడించారు. హీరోయిన్లతో తాను చాలా హుందాగా ఉండటం చూశాను అని ఆమె వెల్లడించారు.
ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన నటించిన దేవర బాక్సాఫీస్‌ను కుదిపేసింది.దాదాపు400 కోట్లకుపైగా రూపాయల కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ఫైటర్, అలాగే ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











