రాంగోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యం’లో ఎన్టీఆర్ టాపిక్.. ఆ సీఎం ఏం చేసింది చూపిస్తాడట

By Manoj Kumar P

రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు చిరునామా. తరచూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తుంటాడు ఈ బడా డైరెక్టర్. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసిన ఈయన.. కొద్దిరోజులుగా వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. సినిమాలు తీయడంలోనూ.. సోషల్ ఇష్యూలపై స్పందించడంలోనూ ఆయన అందరి కంటే భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కొద్దిరోజులుగా ఆయన రాజకీయాలపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

చంద్రబాబు మీద ఒట్టేసి మొదలెట్టాడు

చంద్రబాబు మీద ఒట్టేసి మొదలెట్టాడు

రాంగోపాల్ వర్మ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ సినిమాలోని పాటను విడుదల చేసే వరకు ఇది షూటింగ్ జరుపుకుంటున్నట్లు ఎవరికీ తెలియదు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పాటను విడుదల చేస్తానని వర్మ ట్వీట్ చేశాడు. అందులో ‘ద మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని మొదటి పాటను తొమ్మిదో తారీఖు, తొమ్మిది గంటలకు విడుదల చేస్తాను' అని పేర్కొన్నాడు. అంతేకాదు, ఇది వివాదాస్పదం కాదని చంద్రబాబు మీద ఒట్టేసి చెబుతున్నానన్నాడు. దీంతో అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.

వరుసగా బాంబులు పేల్చుతున్నాడు

వరుసగా బాంబులు పేల్చుతున్నాడు

సంచలన దర్శకుడు ఆర్జీవీ చేస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఆయన కొద్ది రోజులుగా ఇస్తున్న అప్‌డేట్లే. ఇందులో నటించే పాత్రధారులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తున్నాడాయన. ముఖ్యంగా ఓ పార్టీ అధినేతను టార్గెట్ చేసిన వర్మ.. ఆయనపై ఎన్నో బాణాలను సంధిస్తున్నాడు. దీంతో ఆ పార్టీ ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివాదాస్పదం కాదన్నాడు.. కానీ...

వివాదాస్పదం కాదన్నాడు.. కానీ...

రెండు కులాలను ఆధారంగా తీసుకుని వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ రెండు కులాలను వాడకున్నప్పటికీ వివాదాస్పదం కాని సినిమానే చేస్తానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నాడు. అంటే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే దానిపై స్టోరీని అల్లుకున్నాడట ఈ సంచలన దర్శకుడు.

వర్మ కూడా మేకప్ వేసుకుంటున్నాడు

వర్మ కూడా మేకప్ వేసుకుంటున్నాడు

ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ కూడా కనిపిస్తాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయాలపై వర్మ తన మార్క్ ప్రభావం చూపిస్తుండడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, తెలుగు నటి శ్రీరెడ్డి పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీళ్లకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయిందని సమాచారం.

ఇందులోనూ ఎన్టీఆర్ టాపిక్

ఇందులోనూ ఎన్టీఆర్ టాపిక్

రాంగోపాల్ వర్మ ప్రస్తుత రాజకీయాలపై చేస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ఎన్టీఆర్ టాపిక్ ఉంటుందట. దీనికి కారణం... గతంలో ఏపీ ప్రభుత్వం ఆయన తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను నిలిపివేయడానికి ప్రయత్నించిందని వర్మ ఆరోపించడమే. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ను వర్మ చూపిస్తాడని అంటున్నారు. ఇందులో భాగంగానే రాంగోపాల్ వర్మ పాత్ర ఎంటర్ అవుతుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

Recommended Video

#CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !
 ఆ సీఎం ఏం చేసింది చూపిస్తాడట

ఆ సీఎం ఏం చేసింది చూపిస్తాడట

తన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'ను అప్పటి ప్రభుత్వం ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిందని ఆరోపించిన వర్మ.. ఈ సినిమాలో అప్పటి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారని తెలుస్తోంది. తన సినిమా విషయంలో మాజీ సీఎం చేసిన పనులను ఇందులో చూపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో సినిమాపై ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X