‘ఎందుకు?’ సాంగ్... రామారావు కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లను లాగి వర్మ సంచలనం!

ఓ వైపు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోపిక్ విడుదలవుతుండగా.... అందులో చూపించని ఎన్టీఆర్ జీవితంలోని వివాదాస్పద కోణాలను ఆవిష్కరిస్తూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు.

ఇప్పటికే 'వెన్నుపోటు' సాంగ్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసిన వర్మ... తాజాగా 'ఎందుకు?' అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలోని ప్రశ్నల వెనక అబద్దాలుగా చలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ధ్యేయమని తెలిపారు.

వెన్నుపోటుదారులందరి బటల్ని చింపి అవతల పారేస్తాం..

వెన్నుపోటుదారులందరి బటల్ని చింపి అవతల పారేస్తాం..

20 సంవత్సరాలకుపైగా నిజానికి అబద్దం అనే బట్టలు తొడిగి వీధులెంట తిప్పుతున్న వెన్నుపోటుదారులందరి బటల్ని చింపి అవతల పారేసి నిజం బట్టల్ని ఒక్కొట్టిగా మెల్లగా విప్పి దాన్ని మళ్లీ పూర్తి నగ్నంగా చూపించడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్దేశ్యమని వర్మ స్పష్టం చేశారు.

వారిను వదిలి ఆ లక్ష్మీ పార్వతిని ఎందుకు?

వారిను వదిలి ఆ లక్ష్మీ పార్వతిని ఎందుకు?

"జయసుధ, జయప్రద, శ్రీదేవి, కృష్ణ కుమారి, సావిత్రి, అంజలి దేవి వీళ్లందరినీ వదిలి ఆ లక్ష్మీ పార్వతిని ఎందుకు? ఎందుకు? ఎందుకు? " అంటూ ఈ పాట మొదలైంది.

కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ల ప్రస్తావన...

కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ల ప్రస్తావన...

సిబిఎన్, ఎన్‌బికె, దగ్గుబాటి, హరికృష్ణ, చిన్నమ్మ, భువనేశ్వరి వీళ్లందరినీ కాదని ఆ లక్ష్మీపార్వతిని ఎందుకు? ఎందుకు? ఎందుకు? అంటూ ఈ పాటలో ప్రస్తావించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈప్రశ్నల వెనక ఉన్న నిజాలు సినిమాలో వెల్లడించే అవకాశం ఉంది.

వైశ్రాయ్ గొడవ ప్రస్తావన..

వైశ్రాయ్ గొడవ ప్రస్తావన..

మేజర్ చంద్రకాంత్ విజయోత్సవ వేదిక మీద ఆమెనెందుకు? వైశ్రాయ్ గొడవ ఆమె వల్లే జరిగినపుడు అక్కడికి కూడా ఆమెను ఎందుకు? ఆమెకు ముందే పెళ్లై ఉన్నా.. ఎదుగుతున్న కొడుకు ఉన్నా... భార్యగా ఆమెనెందుకు? అంటూ ఆసక్తికర అంశాలను లేవనెత్తుతూ వర్మ ఈ పాట విడుదల చేశారు.

కీర్తి పోతుందని తెలిసినా...

కీర్తి పోతుందని తెలిసినా...

కొడుకులూ కోడళ్లు.. అల్లుళ్లు వద్దు వద్దన్నా ఆమెనే ఎందుకు? రాముడంటూ ఇంటింటా కొలిచినారు.. కృష్ణుడంటూ వేనోళ్ల పొగిడినారు... ఆ కీర్తి ఆమె వల్ల పోతుందని తెలిసినా ఆమెనెందుకు? ఒక్క ఆమెనే ఎందుకు? అంటూ సాగిన ఈ పాటలోని లైన్లు ఆకట్టుకుంటున్నాయి.

ఆమె మహత్యం ఏమిటి?

ఆమె మహత్యం ఏమిటి?

వెనుకన లక్షలాది పసుపు సైన్యం, ముందు చూస్తే కోట్లాది జనసమూహం... వాళ్ల అందరినీ వదిలి ఆ లక్ష్మి పార్వతిని ఎందుకు? ఎందుకు? ఎందుకు? మాటకున్న విలువనీ, బాటకున్న చరితనీ, తిరుగులేని శక్తినీ... రాజకీయ యుక్తిని అన్నింటినీ తులా భారంలో ఓడించిందా? ఆమె మహత్యం...

ఇది మునినే మూర్ఖుని చేసిన ప్రేమా?.. ఇది బుద్దిని గడ్డితినిపించిన ప్రేమా..?

పరువు ఒక వైపు, లక్ష్మీ పార్వతి ఒక వైపు.. సరితూచమంటే మనసు ఒరిగిందా ఆమె వైపు... ఒక సాదాసీదా వనిత కోసం సర్వస్వం వదిలిన తెగువకథ ఇదా..? నీడన బ్రతికే ఆడదాని కోసం రాజే రాజ్యమునొదిలిన చరిత ఇదా? ఇది చరితకు గ్రహణం పట్టిన ప్రేమా?.. ఇది మునినే మూర్ఖుని చేసిన ప్రేమా?.. ఇది బుద్దిని గడ్డితినిపించిన ప్రేమా..? అంటూ ఈ పాట ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X