ఇది కుటుంబ కుట్రల చిత్రం.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌తో వర్మ సంచలనం!
పదవులు పోయినా.. ప్రాణాలు పోయినా.. అయిన వాళ్లు వద్దూ వద్దన్నా.. లక్ష్మి పార్వతి చేయి వదలని ఎన్టీఆర్ లవ్ స్టోరీని బేస్ చేసుకుని రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఇప్పటికే వెన్నుపోటు, ఎందుకు పాటలను విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేయగా... వాలంటైన్స్ డే సందర్భంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ట్రైలర్ రూపం మరో సంచలనానికి తెరలేపబోతున్నారు.
"ఇది కుటుంబ కుట్రల చిత్రం" అనే ట్యాగ్ లైన్‌తో రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. వర్మ చేసిన కొత్త ప్రకటన చాలామందికి చెమటలు పుట్టిస్తోంది.

ఎన్టీఆర్ లోలోపలి లోని ఒక నిర్వీర్యమైన ప్రేమకథ
ఈ కథను ముందెన్నడూ వర్మ చూడని విధానం, తీయని విధానంలో ప్రత్యేకంగా ఉంటుందని తెలియని వాళ్ళు కూడా చెప్తున్నారు. తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవంగా, తెలుగు ఖ్యాతిని నలుదిశలా చేరవేసిన ఎన్టీఆర్ లోలోపలి లోని ఒక నిర్వీర్యమైన ప్రేమకథను "లక్ష్మీస్ ఎన్టీఆర్ "లో ఆవిష్కరించబోతున్నాడు రాంగోపాల్ వర్మ.

ఇలాంటి అంశాలు కొందరికి రుచించకపోయినా
తుది శ్వాస వదలే వరకూ లక్ష్మీ పార్వతి తన గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ జీవితంపై ఆమె ఎలాంటి ప్రభావం చూపించలేదు..? లక్ష్మీ కోసం తన అన్నీ పణంగా పెట్టి పోరాడిన ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య అతి రహస్య సంబంధం ఏంటి? విడదీయరాని ఆ ఆపవిత్ర బంధం ఎంటి..? ఇలాంటి అంశాలు కొందరికి రుచించకపోయినా, అవి తెలుగుప్రజల గొంతుల్లోకి దిగాల్సిన అవసరముంది కనుకనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఆయన కుటుంబ సభ్యులకు, నమ్మకంగా లేని అనుచరులకు, వెన్నుపోటుపొడిచిన కుట్ర దారులకు ముందుపోటులా ఉంటుంది.

నిజాలనే కత్తులతో మూకుమ్మడి దాడి చేయబోతోంది
రాంగోపాల్ వర్మ చెప్పబోయే ఈ కథ, ఎన్టీఆర్ మంచి విషయాలే కాదు, తన సొంత ఫ్యామిలీ వాళ్ళు చేసిన చెప్పుకోలేని పనులను, అడ్డుకోలేని ఎన్టీఆర్ అమాయకత్వాన్ని చూపెట్టబోతోంది. అందుకే ఈ కథ నిజాలనే కత్తులతో మూకుమ్మడి దాడి చేయబోతోంది..తెలిసిన కథలో తెలియని కథనాన్ని వెలికితీయబోతుంది.

ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?
త్వరలో విడుదలకు సిద్దం అవుతున్న ఎన్టీఆర్ అసలు కథ తెలుగు తెరపై లక్ష్మీ ఆటం బాంబులను పేల్చడానికి సిద్దం అవుతోంది. వెలుగులు పంచిన వ్యక్తి చుట్టూ అలుముకున్న చీకట్లను తెరమీదకు తీసుకొస్తున్నాడు వర్మ.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలిపే ట్రైలర్ ను ఫిబ్రవరి 14 న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు చాలా మంది వీపులలో గుచ్చబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ.


Click it and Unblock the Notifications











