BK107: బాలయ్య సినిమాలో మరో స్టార్.. అలాంటి పాత్ర కోసం సాహో నటుడు

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత చాలా కాలం పాటు వరుసగా పరాజయాలను చవి చూశారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. దీంతో విజయాన్ని అందుకోవాలన్న కసితో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చారు. కానీ, అవేమీ ఆయనకు సక్సెస్‌ను అందించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనకు బాగా అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేశారు. గత ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

'అఖండ' మూవీతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న నందమూరి బాలకృష్ణ.. ఈ ఉత్సాహంతోనే భవిష్యత్‌లో నటించే చిత్రాలను ఇప్పటికే ఫైనలైజ్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ముందుగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమాను ప్రకటించారు. గత ఏడాది 'క్రాక్'తో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ దర్శకుడు.. ఇప్పుడు బాలయ్యతో కూడా నిజ జీవిత సంఘటనలతో కూడిన సినిమానే చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తీయబోతున్నారు.

Lal Key Role in Balakrishna and Gopichand Movie

బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ గురించి కూడా చాలా రోజులుగా రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ, బాలయ్యకు సర్జరీ జరగడం.. కరోనా ప్రభావం భారీ స్థాయిలో పెరగడంతో పాటు మరికొన్ని అనివార్య కారణాల వల్ల చిత్ర యూనిట్ మాత్రం షూట్‌ను మొదలు పెట్టలేదు. దీంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణంలో దీన్ని మొదలు పెట్టారు. మొదటి షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో భారీతనంతో రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీలో ప్రముఖ మలయాళ నటుడు, సాహో ఫేం లాల్ నటిస్తున్నారట. సినిమాలోనే ఎంతో ముఖ్యమైన పాత్రకు ఆయనను చిత్ర యూనిట్ ఎంపిక చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో చర్చలు కూడా ముగిశాయని, త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఆయన ఇందులో బాలయ్య వెన్నంటే ఉండే అనుచరుడి పాత్రను చేయబోతున్నారని కూడా ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రూపొందుతోన్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకు జోడీగా హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X