Lal Salaam Trailer Review భాయ్ కాదు భాషా.. రజనీకాంత్ విశ్వరూపం..లాల్ సలామ్ ట్రైలర్ ఎలా ఉందంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సలామ్. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. జీవిత, విష్ణు విశాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్‌లో కీలక అంశాల వివరాల్లోకి వెళితే..
లాల్ సలామ్ చిత్రం ట్రైలర్ విషయానికి వస్తే.. ఓ గ్రామంలో జరిగే రెండు మతాలు, పలు కులాల మధ్య జరిగే భావోద్వేగమైన కథగా కనిపించింది. భావోద్వేగ అంశాలకు క్రికెట్ కూడా తోడైంది. గ్రామంలో జరిగే పరస్పర దాడులు చోటు చేసుకోవడం కనిపించింది. ఆ గ్రామంలో మోయినుద్దీన్ భాయ్ నమాజ్ చేసుకొంటూ కనిపించాడు. ఆ తర్వాత భాయ్ కాదు.. భాషా అంటూ ఆయన కథ చెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపించింది.

లాల్ సలామ్ ట్రైలర్‌లో డైలాగ్స్ తుటాల్లా పేలాయి. మందిని కూడబెట్టేవాడి కన్నా.. ఎవడి వెనుకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం. వాడిని ప్రాణాలతో వదలకూడదు.. బిడ్డ సంపాదిస్తే.. ఇంటికి గౌరవం.. బిడ్డ సాధిస్తే దేశానికి గౌరవం. మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో. మానవత్వాన్ని అందరితో పంచుకో. ఇండియన్‌గా నేర్చుకోవాల్సి అదే అంటూ రజనీకాంత్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి.

గ్రామాల్లో రాజకీయాలు, ఎన్నికలు ప్రధాన అంశంగా మారాయి. అలాగే కులాలు, మత ఘర్షణలు కథలో భాగంగా ఉన్నాయి. అలాగే క్రికెట్ నేపథ్యంలో సినిమా సాగడంతో కపిల్ దేవ్ నటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముంబైలో భాయ్ జీవితం ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుందనే విషయం అభిమానులను థ్రిల్ చేస్తున్నది.

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ చిత్రం తమిళం,తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్నది. యువ హీరో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెటర్ కపిల్ దేవ్ ప్రత్యేక పాత్రల్లో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. జైలర్ సినిమా హిట్ తర్వాత వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











