Lal Salaam Twitter Review: రజనీకాంత్ మాస్ అవతార్.. బాషాను మించి తలైవా!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమా థియేటర్లోకి వచ్చేసింది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత రాజశేఖర్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించాడు. ఈ సినిమా ఇప్పటికే 50 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. బుక్ మై షోలోనే 1 కోటి రూపాయలు కలెక్ట్ అయ్యాయి. తమిళనాడులోనే 147 కోట్లు రాబట్టింది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంటే.. రాత్రి నిద్ర కరువు. రజనీజం గురించి ఎదురు చూస్తున్నాను. శివాజీ సినిమా నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడూ మిస్ కాలేదు. తలైవర్ ఆన్ స్క్రీన్‌పై చూడటానికి ఎదురు చూస్తున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
లాల్ సలామ్ సినిమాలో కొన్ని సీన్లు మతం గురించి, సమానత్వం, డైలాగ్స్ పరంగా ఉన్నాయి. అవన్నీ హైలెట్‌గా ఉన్నాయి. రజనీకాంత్ నటన క్లైమాక్స్‌లో టెర్రిఫిక్. విష్ణు వశాల్, విక్రాంత్ పెర్ఫార్మెన్ప్ అదిరిపోయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











