NBK: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్.. ప్రొఫెసర్ నోట బాలయ్య సాంగ్, వీడియో వైరల్

తెలుగు చిత్రసీమలో సుమారు నలభై ఏళ్లుగా తన హవాను చాటుతూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన నటనతో తిరుగులేని శక్తిగా ఎదిగారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. అలాగే, యంగ్ హీరోల సినిమాలను సైతం ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడికీ వెళ్లినా, ఏ సినిమా అయినా.. జై బాలయ్య అని నినాదం వినపడుతూనే ఉంటుంది. తాజాగా ఓ అమెరికన్ ప్రొఫెసర్ ఏకంగా బాలకృష్ణ పాట పాడి ఆశ్చర్యపరిచారు.

ఫుల్ మాస్ రోల్ లో..

ఫుల్ మాస్ రోల్ లో..

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేయడంతో పాటు సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ హవా చాటుతున్నారు నందమూరి నటసింహా బాలకృష్ణ. సినిమాల్లో తనదైన నటనతో, డ్యాన్స్ లతో అభిమానులకు పూనకాలు తెప్పిస్తారు. ఇటీవల అఖండ సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం వీరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు అన్ స్టాపబుల్ 2తో కూడా ఓటీటీ ప్రేక్షకులను సూపర్ ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలకృష్ణ. ఇప్పటికీ బాలకృష్ణ అనేక పాత్రల్లో నటించి అదరగొట్టారు. ఆయన ఫుల్ మాస్ పాత్రలో నటించిన చిత్రం పైసా వసూల్. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణను విభిన్నంగా చూపించారు.

కైరా దత్ తో కలిసి స్టెప్పులు..

కైరా దత్ తో కలిసి స్టెప్పులు..

2017లో వచ్చిన పైసా వసూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. కానీ ఇందులో బాలకృష్ణలోని కొత్త యాంగిల్ ను చూపించాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమాలో బాలకృష్ణ మేనరిజం, డైలాగ్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రీయ సరన్ జోడి కట్టగా.. మస్కన్ సేథి, కైరా దత్ కూడా అలరించారు. ఇక ఈ సినిమాలో యావత్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పాట పైసా వసూల్. ఈ పాటలో కైరా దత్ తో కలిసి బాలకృష్ణ వేసిన స్టెప్పులు ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పాట ఓ అమెరికన్ ప్రొఫెసర్ పాడారు.

లమర్ యూనివర్శిటిలో..

టెక్సాస్ లోని లమర్ యూనివర్శిటీలో (Lamar university) చదువుతున్న కొందరు తెలుగు విద్యార్థులు వాళ్ల ప్రొఫెసర్ కి బాలకృష్ణ సినిమాలోని పాటలను పరిచయం చేశారు. ఈ క్రమంలో అతనికి పైసా వసూల్ సాంగ్ బాగా నచ్చిందట. దీంతో ఆయనే స్వయంగా ఆ లిరిక్స్ నేర్చుకుని మరి క్లాస్ రూమ్ లో పాడి విద్యార్థులకు వినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఈ వీడియోపై పలువురు మీమ్స్ కూడా చేస్తున్నారు. అంటే బాలయ్య క్రేజ్ టెక్సాస్ వరకు వ్యాపించిందని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X