‘గని’ మూవీకి హాలీవుడ్ టచ్: టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యూనివర్శల్ స్టార్స్

కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ ఉత్సాహంతోనే అప్పుడెప్పుడో కిరణ్ కొర్రపాటితో 'గని' అనే సినిమాను లైన్‌లో పెట్టాడు. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగడం లేదు. ఇలాంటి సమయంలో ఆ మధ్య కొన్ని రోజుల పాటు చిత్రీకరణను జరిపారు. మళ్లీ ఇప్పుడు కరోనా సెకెండ్ వేవ్ కారణంగా మరోసారి దాన్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే వైరస్ ప్రభావం ఉన్నా షూటింగ్‌ను జరపబోతున్నారు. దీని కోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్లను తీసుకొస్తున్నారు.

'గని' సినిమా బాక్సింగ్ నేపథ్యంతో సాగుతుంది. అందుకే ఈ మూవీలో ఇండోర్ షూటింగ్ పార్ట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు కరోనా ప్రభావం ఉన్నా.. దీన్ని కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన బాక్సింగ్ రింగ్ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక, సినిమాలోనే ఎంతో ప్రధానమైన ఈ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్లు లార్నెల్ స్టోవల్, లాడ్ రింబర్గ్‌ను తీసుకు రాబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. వీళ్ళ పర్యవేక్షణలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ సీన్స్ రూపొందించబోతున్నారని తెలుస్తోంది.

Larnell stoval and Vlad Rimburg will Come for Varun Tejs Ghani

గతంలో వీళ్లిద్దరూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'సుల్తాన్' మూవీకి పని చేశారు. దాని తర్వాత తెలుగులోకి 'గని'తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక, ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా రోజుల పాటు బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర విలన్‌గా చేస్తున్నాడు. వీళ్లతో పాటు హిందీ హీరో సునీల్ శెట్టి, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X