Lata Mangeshkar: అత్యధికంగా పురస్కారాలు అందుకున్న టాప్ సింగర్.. 50 వేల పాటలకు పైగా..
భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయని గానకోకిల లతా మంగేష్కర్ నేడు ఉదయం మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ తో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు లతా మంగేష్కర్. ఇక ఇన్ని రోజులు ఆమె ఎంతగానో పోరాడి చివరికి తుది శ్వాస విడిచారు. ఇక ఇక ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో కూడా అత్యదిక పాటలు పాడిన వారిలో లతా మంగేష్కర్ ఒకరు. ఆమె ఇండియాలో అత్యధిక పురస్కారాలు అందుకున్న సింగర్ గా కూడా గుర్తింపు పొందారు.. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

తొలి పాట..
గానకోకిలాగా అభిమానుల నుండి ఎంతో పేరు అందుకున్న లతా మంగేష్కర్, తన కెరీర్ లో దాదాపుగా 30కి పైగా భారతీయ, అలానే విదేశీ భాషల్లో వేలాది పాటలు ఆలపించారు. కెరీర్ లో ఆమె 50 వేలకు పైగా పాటలు పాడారు. తన కెరీర్ లో తొలిసారిగా 1942లో ఒక మరాఠీ సినిమాకి తన తొలి సాంగ్ ని పాడారు లతా. అయితే ఆ తరువాత ఆ పాట ఎడిటింగ్ లో పోవడంతో ఆమె పాడిన తొలి సాంగ్ సినిమాలో రాలేదు.

అలా కెరీర్ మొదలు..
అయితే అదే ఏడాది పెహాలి మంగళగౌర్ సినిమాలో ఆమెకు చిన్న వేషం లభించడంతో ఆ సినిమా సంగీత దర్శకుడు వినాయక్ మాస్టర్ ఆమెకు అందులో రెండు పాటలు పాడే అవకాశం కూడా కల్పించారు. ఆ తరువాత ముంబై వెళ్లిన లతా, అక్కడే హిందూస్థానీ, క్లాసికల్ వంటి సంగీతాలు నేర్చుకుని గాయనిగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని మంచి పేరు, అవకాశాలు అందుకున్నారు.

తెలుగులో బెస్ట్ సాంగ్ అదే :
అనేక భారతీయ భాషల్లో ఎన్నో వేల పాటలు పాడిన లతామంగేష్కర్ తెలుగులో కూడా పలు పాటలు పాడారు. అయితే వాటిలో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన సంతానం సినిమాలోని నిదురపోరా తమ్ముడా అంటూ ఎంతో హాయిగా మెలోడియస్ గా సాగె పాట గాయనిగా లతకు తెలుగులో విపరీతంగా పేరు తెచ్చిపెట్టింది. అటు హిందీలో కూడా అనేక పాటలు పాడిన లతాకి అప్పటి సంగీత దర్శకులు సలీల్ చౌదురి, మదన్ మోహన్ అంటే ఎంతో అభిమానం ఉండేది. సలీల్ చౌదురి సంగీత సారధ్యంలో ఆజారే పరదేశి అనే సాంగ్ ని అప్పటి మధుమతి సినిమా కోసం ఆలపించిన లతా, ఆ సాంగ్ తో ఏకంగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకోవడం విశేషం.

సంగీతం, నిర్మాణం కూడా :
ఇక తన కెరీర్ లో అనేక భాషల్లో వేలాది సాంగ్స్ పాడిన లతా మంగేష్కర్ కి గతంలో సంగీతం కూడా నేర్చుకుని ఉండడంతో ఆపైన ఆమె మరాఠీలో నాలుగు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసారు. అలానే తన పేరుతోనే 'రామ్ రామ్ పహ్వనే' అనే సినిమాకి ఆమె అందించిన సంగీతానికి అప్పటి ప్రేక్షకుల నుండి విపరీతంగా పేరు లభించింది. అది మాత్రమే కాక మరాఠీలో ఆమె వాదల్ అనే సినిమాని కూడా నిర్మించి మంచి పేరు అందుకున్నారు. అలానే 1955లో ఝన్ఝూర్, కంచన్ అనే సినిమాలతో పాటు 1990లో లేకిన్ అనే సినిమాని కూడా నిర్మించారు లతా మంగేష్కర్.

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తరువాత
భారత ప్రభుత్వం నుండి అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం. అటు హిందీతో పాటు తెలుగు సహా అనేక భాషల్లో పాటలు పాడిన లతా మంగేష్కర్ కి అవార్డ్లు కూడా అప్పట్లో అనేకం లభించాయి.

జాతియా అవార్డులు..
దాదా సాహెబ్ ఫాల్కే (1989), మహారాష్ట్ర భూషన్ అవార్డు (1997), ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు (1999)
శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్, రాజాలక్ష్మీ అవార్డు (1990) ఎ.ఎన్.ఆర్. జాతీయ అవార్డు (2009), అప్సరా అవార్డు, కాళిదాస్ సమ్మాన్ అవార్డు, తాన్ సేన్ అవార్డు, నేపాల్ అకాడమీ అవార్డు,సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డులు అందుకున్నారు.

కెరీర్ లో ఎన్నో పురస్కారాలు కూడా
అటు హిందీతో పాటు తెలుగు సహా అనేక భాషల్లో పాటలు పాడిన లతా మంగేష్కర్ కి అవార్డ్లు కూడా అప్పట్లో అనేకం లభించాయి. భారత దేశ అత్యున్నత పురస్కారం 2001లో భారతరత్న తో పాటు అంతకముందు 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, అలానే 1989లో ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని సైతం అందుకుని గాయనిగా ప్రేక్షకుల రివార్డులతో పాటు అనేక అవార్డులు అందుకున్న వ్యక్తిగా నిలిచారు. అయితే మన భారతీయ అవరులు మాత్రమే కాకుండా ఫ్రాన్స్ దేశం వారి తరపున అక్కడి ప్రభుత్వం అందించిన లీజియన్ ఆఫ్ హానర్ అనే ప్రఖ్యాత అవార్డు కూడా లతా మంగేష్కర్ ని వరించింది.

ప్రముఖుల నివాళులు :
ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఆమె మనల్ని విడిచి తిరీరాని లోకాలకు వెళ్లిపోయారని తెల్సిన వెంటనే బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అనేక చిత్ర పరిశ్రమలకు చెందిన అభిమానులతో పటు పలువురు చిత్ర ప్రముఖులు లతా మంగేష్కర్ మృతికి నివాళులు అర్పిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమె పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అందరం ఎంతో ఆనందించాం అని, అలానే త్వరలోనే లతా సంపూర్ణ ఆరోగ్యంతో మన ముందుకు వచ్చి తన మధుర గానామృతంతో అందరినీ అలరిస్తారని భావించిన తరుణంలో ఒక్కసారిగా ఆవిడ మనల్ని విడిచి వెళ్లిపోయారని వార్త నేడు వినడం ఎంతో బాధాకరం అని పలువురు లతా మంగేష్కర్ అభిమానులు తమ బాధాతప్త హృదయంతో ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











