TNRకు కర్ణ మూవీ టీమ్ ఘన నివాళి.. కుమార్తె, కుమారుడి చేతుల మీదుగా సాంగ్ రిలీజ్
యూట్యూబర్, నటుడు, సినీ విమర్శకుడు TNR కెరీర్ పరంగా ఎదుగుతున్న సమయంలోనే కరోనావైరస్ కబళించింది. టీఎన్నాఆర్ ఆకస్మిక మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. మరణం తర్వాత ఆయన నటించిన సినిమాలు రిలీజ్ కావడంతో ప్రేక్షకుల హృదయాల్లో టీఎన్నాఆర్ సజీవంగా నిలిచిపోతున్నారు. ఇలాంటి తరుణంలో టీఎన్నాఆర్ జయంతి రోజున కర్ణ మూవీ టీమ్ ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. ఆయన కుమార్తె, కుమారుడి చేతుల మీదుగా కర్ణలోని ఫీల్‌గుడ్ సాంగ్‌ను ఆవిష్కరింప జేశారు. ఈ సందర్భంగా కర్ణ టీమ్ తీసుకొన్న నిర్ణయంపై టీఎన్నాఆర్ ఫ్యాన్స్, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్ణ సినిమా సాంగ్ రిలీజ్ విషయంలోకి వెళితే..
సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై కళాధర్ కొక్కొండ దర్శకత్వంలో కర్ణ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో స్వయంగా చిత్రంలోని ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. కథ, స్క్రీన్ ప్లే కూడా కళాధర్ కొక్కొండనే అందించడం విశేషం.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, ఇతర పనులు శరవేగంగా చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలోని 'కర్ణ' థీమ్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. దివంగత నటుడు, సినీ విశ్లేషకులు TNR జయంతి సందర్భంగా ఆయన పిల్లలు దివిజ, రుత్విక్ ఈ సాంగ్ లాంచ్ చేశారు. ఈ పాటకు అనిల్ ఎనమడుగు లిరిక్స్ రాయగా ప్రసాద్ ఆలపించారు. ప్రశాంత్ BJ అందించిన మ్యూజిక్ పాటలో వస్తున్న సన్నివేశాలకు ప్రాణం పోసింది. ఈ పాటలో చూపించిన సన్నివేశాలతో ఈ మూవీ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిందని తెలుస్తోంది.

''భగ భగ మండే నిప్పుల కొలిమే నడిచే చూడు.. మరిగే రక్తం ఉరకలు వేసే విప్లవం వీడు'' అంటూ హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా సాగిపోతున్న ఈ పాటలో ప్రతి సన్నివేశం డైరెక్టర్ ప్రతిభను బయటపెడుతోంది. ఈ 'కర్ణ' సినిమాలో హీరో కళాధర్ కొక్కొండ రోల్ ఎంత బలంగా ఉండనుందో ఈ థీమ్ సాంగ్ వెల్లడిస్తోంది. హీరో డిఫరెంట్ లుక్ సినిమాకు మరో అసెట్ కానుందని తెలుస్తోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. జనవరి 28న ఈ కర్ణ మూవీ రిలీజ్ కానుంది.
నటీనటులు: కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, అస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళాధర్ కొక్కొండ
నిర్మాత: కళాధర్ కొక్కొండ
మ్యూజిక్: ప్రశాంత్ BJ
DOP: శ్రవణ్ G కుమార్
ఆడియో: మధుర ఆడియో
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు
బ్యానర్: సనాతన క్రియేషన్స్


Click it and Unblock the Notifications











