కత్తి మహేష్ అప్పటివరకు ఆసుపత్రిలోనే.. ఎటువంటి ఫండ్స్ తీసుకోలేదు.. కానీ అవసరమే!

కాంట్రవర్సీ క్రిటిక్ గా ఒకప్పుడు పలు వివాదాల్లో చిక్కుకున్న కత్తి మహేష్ చాలా రోజుల అనంతరం ఒక యాక్సిడెంట్ ఘటనతో వార్తల్లో నిలవడం హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆయన సన్నిహితులు అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక అతనికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉండగా కత్తి మహేష్ స్నేహితుడు సురేష్ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి సోషల్ మీడియా ద్వారా ఒక వివరణ ఇచ్చారు.

Recommended Video

Medicare hospital doctors would release health bulletin on Kathi mahesh health condition soon
రాబోయే రాజుల్లో

రాబోయే రాజుల్లో

వెంకట్ సిద్ధారెడ్డి సోషల్ మీడియాలో ఈ విధంగా వివరణ ఇచ్చారు. 'మహేష్ కత్తి హెల్త్ కోసం చాలా మంది ఫోన్ చేస్తున్నారు. వైద్య ఖర్చుల కోసం ఆయనకు సహాయం చేస్తామని చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే హాస్పిటల్ ఖర్చుల కంటే రాబోయే రాజుల్లో కత్తి రీహాబిలిటేషన్ అనేది చాలా ముఖ్యం.. కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.

ఎటువంటి ఫండ్స్ తీసుకోలేదు.

ఎటువంటి ఫండ్స్ తీసుకోలేదు.

రీహాబిలిటేషన్ ని దృష్టిలో పెట్టుకుని కత్తి హెల్త్ రీకవరీ ఎండ్ రీహాబిలిటేషన్ ఫండ్ ఒకటి క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకూ ఎవరి వద్ద నుంచీ ఎటువంటి ఫండ్స్ తీసుకోలేదు. సోషల్ మీడియాలో ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు.. అని చెప్పారు.

ఇంకో మూడు వారాల పైనే

ఇంకో మూడు వారాల పైనే

ఇక వారికి హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల డబ్బుల అవసరం రాలేదని కాకపోతే కత్తి మహేష్ ఇంకో మూడు వారాల పైనే హాస్పిటల్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కూడా రికవరీకి సమయం పడ్తుందని అన్నారు. ఈ ఫండ్ ఏదైనా 80G రిజిస్టర్డ్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేద్దామనే ఆలోచనలో ఉన్నామని కూడా వివరణ ఇచ్చారు.

ఫండ్ రైజింగ్

ఫండ్ రైజింగ్

కొంతమందితో సంప్రదిస్తున్నామని రేపట్నుంచి ఫండ్ రైజింగ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెబుతూ హెల్త్ పరంగ ఇవాళ మధ్యాహ్నం జరగబోయే ఆపరేషన్ తో మనకి మరింత సమాచారం తెలుస్తుందని అన్నారు. అలాగే అప్పటివరకు బయట వచ్చే రూమర్స్ ను ఎవరు నమ్మవద్దని ఎప్పటికప్పుడు కత్తి మహేష్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X