అనుష్క, ప్రభాస్ ఒకటి కాబోతున్నారా? ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలంటున్న ఫ్యాన్స్

తెలుగు సినిమా దగ్గర ఇంకా పెళ్లి కానీ బిగ్ స్టార్స్ చాలా మందే ఉన్నారని చెప్పాలి. హీరోలు సహా హీరోయిన్స్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ఉండగా వారిపై సోషల్ మీడియాలో పలు మార్లు ఇంట్రెస్టింగ్ ఫన్ పోస్ట్ లు కూడా వైరల్ అవుతాయి. కాగా ఇలా తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ హీరో హీరోయిన్ లలో ప్రభాస్, రానా దగ్గుబాటి, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మంది హీరోస్ కనిపిస్తే హీరోయిన్స్ లో దాదాపు కొందరు స్టార్ నటులు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు.

కానీ ఒక్క హీరోయిన్ మాత్రం ఇంకా తన పెళ్లి పట్ల ఆసక్తి చూపించడం లేదు. మరి ఆ హీరోయినే అనుష్క శెట్టి. తెలుగు సినిమాలో అనుష్క శెట్టి క్రేజ్ వేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నెమ్మదిగా చేసినా అనుష్క సినిమాలతో మంచి ఆదరణ ఇంకా మార్కెట్ కూడా సంపాదించుకుంది. బాహుబలి లాంటి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నప్పటికీ స్వీటీ ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా ఇంట్రెస్టింగ్ సినిమాలు సౌత్ నుంచే చేసింది.

latest proof on anushka shetty and prabhas relationship

అలా కొన్ని ప్లాప్స్ తర్వాత గ్యాప్ తీసుకొని సినిమా చేసినప్పటికీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అంటూ సాలిడ్ హిట్ అందుకుంది. కాగా అనుష్క ఇంకా హీరో ప్రభాస్ ల విషయంలో ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా జెనరల్ ఆడియెన్స్ కి కూడా వారి జోడి అంటే ఎంతో ఇష్టం.. అలా ఈ కాంబినేషన్ ఒకటైతే చూడాలి అని చాలా మంది కోరుకునే వారు ఉండగా తాము మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ గానే మెలుగుతారు.

అయితే ఎప్పుడు నుంచో వీరి మీద కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కానీ తాజాగా మళ్ళీ ఇద్దరు మేటర్ వైరల్ గా మారింది. దీనికి కారణం అనుష్క పెట్టిన ఒక్క పోస్ట్ అని చెప్పాలి. రీసెంట్ గా అనుష్క బాహుబలి 2 నుంచి తన పిక్ ఒకటి షేర్ చేసింది. బాహుబలితో కలిసి యుద్ధం చేసే సీన్ లో రెడ్ కాస్ట్యూమ్ లో దేవసేన గా అనుష్క కనిపిస్తుంది. ఈ పిక్ ని సడెన్ గా పోస్ట్ చేసింది కనీసం ఎలాంటి కాప్షన్ కూడా పెట్టలేదు.

కాగా ఈ పోస్ట్ ఎందుకు వైరల్ అవుతుంది అంటే ఆ పోస్ట్ పెట్టిన రోజునే తన కో స్టార్ హీరో ప్రభాస్ నటించిన చిత్రం "ది రాజా సాబ్" గ్లింప్స్ కూడా వచ్చింది. ఈ తర్వాత అనుష్క అదే రోజున పోస్ట్ చేయడం జరిగింది. అయితే అనుష్క పోస్ట్ ఎందుకు అంత స్పెషల్ గా మారింది అంటే అక్కడ రాజా సాబ్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ చూస్తే తాను కూడా రెడ్ కలర్ బట్టల్లోనే స్టైలిష్ గా కనిపిస్తాడు.

latest proof on anushka shetty and prabhas relationship

ఇక్కడ అనుష్క కూడా బాహుబలి 2 నుంచి అదే రంగు దుస్తులు ఉన్న ఫోటోనే తనది సైలెంట్ గా షేర్ చేసుకుంది. దీనితో ప్రభాస్ కోసమే పోస్ట్ చేసింది అంటూ అభిమానుల్లో ఆ పోస్ట్ అల్ల కల్లోలం అయ్యి కూర్చుంది. దీనితో ఇద్దరి మధ్య ఏదో మాత్రం నడుస్తుంది అని మళ్ళీ టాక్ మొదలైంది.

మెయిన్ గా అనుష్క ఒక్క పిక్ మాత్రమే పెట్టి ఎలాంటి మేటర్ ని కూడా షేర్ చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావు తీసింది. మరి ఆ గుడ్ న్యూస్ ఏదో ఇద్దరూ ఇచ్చేస్తారో లేదా ఇదంతా కేవలం యాదృచ్చికంగానే జరిగిందో వారికే తెలియాలి. కాగా ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ సహా స్పిరిట్, తదితర సినిమాల్లో బిజీగా ఉండగా అనుష్క దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో "ఘాటీ" అనే సినిమా చేస్తుంది.

More from Filmibeat

Read more about: prabhas anushka the raja saab
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X