అఖిల్ నెక్ట్స్ మూవీలో నాగార్జున పైసా కూడా పెట్టడం లేదట!
అక్కినేని చిన్నోడు అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లయింది. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. తన కుమారుడిని గ్రాండ్‌గా లాంచ్ చేద్దామని నాగార్జున వేసిన ప్లాన్స్ తొలి ప్రయత్నంలోనే బెడిసి కొట్టాయి. మొదటి చిత్రం 'అఖిల్' దారుణమైన పరాజయం పాలైంది. ఆ తర్వాత చేసిన 'హలో', 'మిస్టర్ మజ్ను' చిత్రాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఉంటే అఖిల్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ... కింగ్ నాగార్జున కొడుకు కావడం, హిట్లు లేక పోయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో నాలుగో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు ఈ అక్కినేని యంగ్ హీరో.

ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించబతోన్నాడు. గీతా ఆర్ట్స్ 2 బేనర్లో బన్నీ వ్యాస్ ఈ మూవీని నిర్మించబోతున్నారు. భాస్కర్ సినిమా అంటేనే లవ్ స్టోరీ మెయిన్ కాన్సెప్టుగా ఉంటుంది. అఖిల్‌ను గత సినిమాలకు భిన్నంగా ఒక క్యూట్ లవ్ స్టోరీతో ప్రజెంట్ చేయబోతున్నాడట.
అయితే ఈ ప్రాజెక్టులో నాగార్జున కూడా పెట్టుబడి పెడుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అది నిజం కాదని తెలిపోయింది. కథలో కానీ, ప్రొడక్షన్లో కానీ ఆయన ఇన్వాల్వ్ కావడం లేదట. గతంలో తాను చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాక పోవడంతో నాగార్జున జిఏ2 బేనర్ వారు నిర్మించే ఈ ప్రాజెక్టుకు దూరంగా ఉంటున్నారట.
కథ విషయానికొస్తే... క్యూట్ లవ్ స్టోరీతో కూడిన ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందట. జూన్లో ఈ చిత్రం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. రష్మికకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ చిత్రానికి మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











