twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ, మహేష్ బాబులు మాత్రమేనా? నాకేం తక్కువ అన్నట్లుగా ప్రభాస్..

    |

    తెలుగు సినిమాల జోరు రోజు రోజుకూ పుంజుకుంటోంది. లేటెస్ట్‌గా వస్తున్న తెలుగు సినిమాలను హిందీ, తమిళ, కన్నడ, మళయాళ పలు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు డబ్బింగ్ చెప్పుకోవడంలో కూడా విలక్షణత చాటుకుంటున్నారు తెలుగు హీరోలు. ఇప్పటికే బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబులు తన సినిమాలకు తామే డబ్బింగ్ చెప్పుకోగా తాజాగా అదే బాటలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వెళ్తున్నాడనేది తాజా సమాచారం.

    ప్రభాస్ హీరోగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న తాజా సినిమా 'సాహో'. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. భారీ సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులకే గాక హిందీ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో హిందీ వర్షన్‌లో ప్రభాస్ తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట. బేసికల్‌గా హిందీ భాషపై పట్టున్న రెబల్ స్టార్ హిందీ ఆడియన్స్‌ని మెప్పించేందుకు గాను హిందీ భాషలో సరైన శిక్షణ కూడా పొందాడని తిలిసింది.

    Latest Update of Sahoo Hindi Version

    కాగా ఇప్పటికే ఇలా డబ్బింగ్ విషయంలో బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ముందుపడగా.. తాజాగా మీ బాటలోనే నేను కూడా అన్నట్లుగా ప్రభాస్ రంగంలోకి దిగాడు. ఊపిరి సినిమా తమిళ వర్షన్ కి నాగార్జున సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. అలాగే మహేష్ బాబు మొదటిసారి తన 'స్పైడర్' తమిళ వెర్షన్‌లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అటు బాలకృష్ణ కూడా 'శ్రీరామరాజ్యం' హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు ఆయనే మాటలు చెప్పుకున్నాడు. చెప్పుకుంటూ పోతే కార్తీ, సూర్య, కమల్ హాసన్, రజినీకాంత్ ఇలా చాలామందే ఈ లిస్టులో ఉన్నారు. ఇప్పుడు వీళ్ల బాటలోనే ప్రభాస్ కూడా 'సాహో' హిందీ వెర్షన్‌కు ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం ఆసక్తికర అంశంగా మారింది.

    సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో 'సాహూ' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎవోలిన్ శర్మ లాంటి భారీ తారాగణం నటిస్తోంది. చిత్రాన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

    English summary
    Young rebal star Prabhas new movie Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully going on. As per Latest talk Prabhas doing own dubbing in hindi varsion of Sahoo
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X