KGF దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ.. ఆలస్యం కావడానికి కారణమిదే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. RRR సినిమాతో తారక్ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరి చూపు ఇప్పుడు అతని వైపే ఉంది. మల్టీ టాలెంటెడ్ కావడంతో జనాలను ఈజీగా ఎట్రాక్ట్ చేయగల సత్తా ఉంది. అందుకే పాన్ ఇండియా కథలు జూనియర్ ఎన్టీఆర్ ని వెతుక్కుంటూ వస్తున్నాయి.
అసకు మ్యాటర్ లోకి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నట్లు గత కొన్ని నెలలుగా కథనాలు వెలువడుతున్నాయి. ప్రశాంత్ కూడా ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా త్వరలోనే ఆయనతో వర్క్ చేసే టైమ్ వస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇంకా ఆ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయకపోవడానికి కారణం దర్శకుడు స్క్రిప్ట్ లో సరైన మార్పులు చేయకపోవడమేనని తెలుస్తోంది.

ఇప్పటికే రెండు సార్లు ప్రశాంత్ నీల్ చెప్పిన మెయిన్ కథ విన్న ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడట. ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పిరియడ్ డ్రామాగా సినిమా కథను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తారక్ మాత్రం ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతే సినిమాను స్టార్ట్ చేద్దామని చెబుతున్నాడట. దీంతో దర్శకుడు ప్రశాంత్ KGF సినిమాను పూర్తి చేసిన తరువాత ఎన్టీఆర్ కోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











