పవన్ కళ్యాణ్ సినిమా కోసం డైరెక్టర్ క్రిష్ కొత్త ప్లాన్.. అన్ని పనులు ఒకే చోట!
కరోనా వైరస్, లాక్ డౌన్ లేకపోయి ఉంటే.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఈ పాటికి థియేటర్స్ వద్ద సందడి చేస్తూ ఉండేది. పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫైనల్ గా అవన్నీ గాలిలో కలిసిపోయాయు. ఇకపోతే పవన్ తన సినిమాల విషయంలో ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా సినిమా షూటింగ్స్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకున్నాడు. అదే విధంగా వకీల్ సాబ్ షూటింగ్ ని దాదాపు ఫినిష్ చేశాడు. ఇకపోతే పవన్ ఆ సినిమా తరువాత క్రిష్ డైరెక్షన్ లో విరుపాక్ష అనే ఒక పిరియాడిక్ డ్రామాలో నటించాలని అనుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ ని కూడా పవన్ చాలా తొందరగా ఫినిష్ చేయాలని అనుకున్నాడు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అనుకున్న ప్రదేశాల్లో షూటింగ్ చేయడానికి కుదరదు.

కాబట్టి అన్ని పనులు వీలైనంత వరకు ఒకే చోట జరగాలని పవన్ దర్శకనిర్మాతలతో చర్చించారట. దీంతో క్రిష్ కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అనుకున్న బడ్జెట్ లోనే రామోజీ ఫిల్మ్ సిటీలో విరుపాక్ష కథకు అవసరమైన సెట్స్ వేసి షూటింగ్ నిర్వహించాలని అనుకుంటున్నారట.
అందుకోసం చిత్ర యూనిట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ తో కలిసి స్పెషల్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











