RRR అభిమానులకు గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ టీజర్ వచ్చేది ఎప్పుడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కకుండా ఇండియన్ సినిమా హిస్టారిలోనే మునుపెన్నడు లేని విధంగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం RRR. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం అనంతరం దర్శకుడు రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను సెలెక్ట్ చేసుకొని చేస్తున్న సినిమా కావడంతో ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక స్పెషల్ గుడ్ న్యూస్ ఇప్పుడు మరింత వైరల్ అయ్యేలా కనిపిస్తోంది.

ఒక వండర్ అనే చెప్పాలి..

ఒక వండర్ అనే చెప్పాలి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విదంగా మెగా నందమూరి హీరోలు ఒకే తెరపై కనిపించడం అనేది ఒక వండర్ అనే చెప్పాలి. ఇక దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన అల్లురి సీతారామరాజు పాత్రను టీజర్ తో పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ పాత్ర కొమురం భీమ్ క్యారెక్టర్ యొక్క టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని.. ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మూడు రోజుల పాటు టెస్ట్ షూట్

మూడు రోజుల పాటు టెస్ట్ షూట్

అసలు సిషయంలోకి వస్తే సినిమాకి సంబంధించిన టెస్ట్ షూట్ కోసం దర్శకుడు రాజమౌళి ప్లాన్ మొత్తం రెడీ చేసుకున్నారు. ఇప్పటికే పాతబడిన సెట్స్ ని కూడా మళ్ళీ కొత్తగా డిజైన్ చేశారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు టెస్ట్ షూట్ ని నిర్వహించబోతున్నారట. అయితే అందులో ప్రధానం తారాగణం పాల్గొనదని తెలుస్తోంది.

ఎన్టీఆర్ సన్నివేశాలపై స్పెషల్ ఫోకస్

ఎన్టీఆర్ సన్నివేశాలపై స్పెషల్ ఫోకస్

టెస్ట్ షూట్ పై ఒక క్లారిటీ వచ్చిన తరువాత మరో ప్లాన్ తో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. మొదట ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాలను ఎక్కువగా షూట్ చేయనున్నారు. తారక్ కి జోడిగా కనిపించబోయే ఓవియాతో పాటు అజయ్ దేవ్ గన్, అలియా భట్ కూడా కొన్ని సీన్స్ కోసం ఈ షెడ్యూల్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ అనంతరం జరగబోయే మరో షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొంటాడు.

Recommended Video

MAA Passes New Rule, Actors Remuneration To Be Reduced By 20 Percent | Filmibeat Telugu
ఎన్టీఆర్ టీజర్ ఎప్పుడంటే..?

ఎన్టీఆర్ టీజర్ ఎప్పుడంటే..?

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ పై కూడా జక్కన్న ఒక ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుకున్నట్లు జరిగితే ఈ ఎడాది మే నెలలో తారక్ బర్త్ డేకు టీజర్ రావాల్సింది. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ఇక ఇప్పుడు దసరా సమయానికి ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వాలని దర్శకుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కుదిరితే అప్పుడే టీజర్ రావచ్చని టాక్ వస్తోంది. ఫైనల్ గా వీలైనంత త్వరగా నందమూరి, RRR అభిమానుల కోసం టీజర్ ని విడుదల చేయాలని రాజమౌళి సిద్ధమవుతున్నట్లు ఒక బలమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X