twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR Shoot Update: ఒక్క నెల కష్టపడితే మొత్తం అయిపోయేది.. జక్కన్న ప్లాన్ మొత్తం వృధా

    |

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ కావడంతో అంచనాలు ఇప్పటికే అకాశాన్ని దాటిపోయాయి. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులకు ఇటీవల బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

    కోవిడ్ కారణంగా ఎన్నోసార్లు షూటింగ్స్ కు బ్రేక్ పడింది. ఆ మధ్య తగిన జాగ్రత్తలతో గ్యాప్ లేకుండా స్పీడ్ గానే పూర్తి చేయడం వల్ల దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇక మరో 40 రోజులు కరెక్ట్ గా వర్క్ చేస్తే షూటింగ్ అయిపోతుందని అనుకున్న సమయానికి సెకండ్ వేవ్ ఊపందుకోవడం అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు కోవిడ్ పాజిటివ్ రావడంతో బ్రేక్ వేయక తప్పలేదు.

    Latest update on RRR shooting 2 more songs balanced with few scenes

    సినిమాలో కీలక సన్నివేశాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉందట. ఆ సీన్స్ కోసం తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు ఉండాల్సిందేనట. ఇక రామ్ చరణ్, అలియా భట్ కాంబినేషన్ లో రెండు సాంగ్స్ ను కూడా షూట్ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

    నెల రోజుల్లో షూటింగ్ పనులు అయిపోతే తీరిగ్గా స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అవ్వాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడు. కానీ కోవిడ్ దెబ్బకు ఇప్పుడు మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ కోసం ఆలోచించాల్సి వస్తోంది. పరిస్థితులను బట్టి చూస్తుంటే RRR వచ్చే ఏడాది సమ్మర్ లోనే రావచ్చని సమాచారం.

    English summary
    Junior NTR worked hard to get into the film industry. Despite his Nandamuri background, he received a unique craze of his own, taking chances with his own talent. However, a co-director recently explained that Tarak would be friends with anyone, no matter how much stardom has increased. He also recalled what Tarak had said during the shooting of a movie..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X