చక చకా పూర్తి చేస్తున్న సమంత, చైతు!
రియల్ లైఫ్ కపుల్స్ చైతు, సమంత పెళ్లయ్యాక తొలిసారి జంటగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శత్వంలో వీరిద్దరూ మజిలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్ర యూనిట్ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించింది. సింహాచలం రైల్వే స్టేషన్ లో చైతు, సమంతపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తోంది.
బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నుకోరి చిత్రంతో విజయాన్ని అందుకున్న శివ నిర్వాణ దర్శత్వంలో తెరకెక్కుతుండడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. సమంత, చైతు పూర్తి సమయం ఈ చిత్రం కోసం కేటాయిస్తుండడంతో షూటింగ్ వేగంగా పూర్తవుతోంది.

ఇక ఈ చిత్రానికి మజిలీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. దీనినే అసలైన టైటిల్ గా పరిగణిస్తారా లేదా అనే విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా చైతు ఈ చిత్రంతో విజయాన్ని అందుకోవడం చాలా కీలకం. చైతు చివరగా నటించిన శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి చిత్రాలు నిరాశపరిచాయి.


Click it and Unblock the Notifications











