Raj Tarun : రాజ్‌తరుణ్‌కు బిగుస్తోన్న ఉచ్చు .. నన్ను చంపేస్తారంటూ పోలీస్ స్టేషన్‌కి లావణ్య
ముగిసిపోయింది అనుకున్న రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. బుధవారం రాజ్ తరుణ్ తల్లిదండ్రులను లావణ్య ఇంట్లో నుంచి గెంటేయడంతో హైడ్రామా నెలకొంది. ఆ వెంటనే మీడియా, పోలీసులు, రాజ్ తరుణ్ సన్నిహితులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో నానా రచ్చ జరిగింది. ఈ ఘటనతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఇంట్లో నుంచి తము గెంటేయడంపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా ఈరోజు ఈ వివాదం మరో కొత్త టర్న్ తీసుకుంది.
తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ గతేడాది హీరో రాజ్‌తరుణ్‌పై లావణ్య చేసిన ఆరోపణలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. నాటి నుంచి పోలీసులు, కోర్టులు, మధ్యలో కొందరి రంగ ప్రవేశంతో ఈ వివాదం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లింది. అయితే ఏమైందో ఏమో కానీ లావణ్య బహిరంగంగానే రాజ్ తరుణ్‌కు క్షమాపణలు చెప్పడంతో పాటు కనిపిస్తే కాళ్లు మొక్కుతానని కూడా వ్యాఖ్యానించడంతో ఈ వివాదం ముగిసిందని అంతా అనుకున్నారు. రాజ్ తరుణ్ కూడా గతం మరిచిపోయి తన సినిమా ప్రమోషన్ కోసం యాక్టీవ్‌గా తిరుగుతున్నాడు.

అంతా హ్యాపీగా ఉందని అనుకుంటున్న దశలో రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇందుకు కారణం ఓ విల్లా. హైదరాబాద్ కోకాపేట ప్రాంతంలో ప్రస్తుతం లావణ్య ఉంటున్న విల్లా రాజ్ తరుణ్‌ది. అది తమ కుమారుడిదని , అందులో ఉండే హక్కు మాకే ఉంటుందని రాజ్ తల్లిదండ్రులు విల్లాలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీంతో లావణ్య తమను బయటికి గెంటేసిందని, రోడ్డు మీదకు వచ్చామని ... ఇంట్లోకి వెళ్లకుండా తమను ఎవరూ ఆపలేరంటూ బైఠాయించారు. రాజ్ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ విల్లా కొన్నాడని వారు కన్నీటి పర్యంతమయ్యారు.
అయితే లావణ్య మాత్రం రాజ్ తరుణ్ తండ్రి తనపై 15 మందితో కలిసి దాడి చేశారని.. బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించడంతోనే వాళ్లని లోపలికి రానివ్వలేదని తెలిపింది. అలాగే రాజ్ తరుణ్ తదనంతరం ఈ విల్లా తనకు చెందుతుందని వీలునామా రాశారని , పైగా ఈ విల్లా కొనే సమయంలో తన తండ్రి రాజ్ తరుణ్‌కు రూ.80 లక్షల వరకు సాయం చేశాడని అంటోంది. అయితే హీరో తల్లిదండ్రులు తెల్లవారుజాము వరకు బయటే ఉండటంతో నార్సింగి పోలీసులు జోక్యం చేసుకుని వారిని లోపలికి పంపించారు.
ఇక ఈ రోజు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రాజ్ తరుణ్ అతని మనుషుల నుంచి తనకు ప్రాణహానీ ఉందంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ అతని తల్లిదండ్రులు 15 మందితో కలిసి తనపై దాడి చేసి ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని పేర్కొంది. రాజ్ తరుణ్‌ని వదిలేస్తే డబ్బులిస్తామని అతని పేరెంట్స్ ఆఫర్ ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజ్‌ను విడిచిపెట్టలేదని , శేఖర్ భాషాకు డబ్బులిచ్చి రాజ్‌తరుణ్ ఇదంతా నడిపిస్తున్నాడని రాజ్ వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని లావణ్య డిమాండ్ చేశారు. రాజ్ తరుణ్‌పై హైకోర్టుకి వెళ్తానని.. అతని బెయిల్ క్యాన్సిల్ చేయిస్తానని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











