అబార్షన్ చేయించానా?.. నా మొగుడితో హీరోయిన్ కాపురమా? రాజ్ తరుణ్‌తో లావణ్య బిగ్ ఫైట్

కొద్ది రోజులుగా సద్దుమణిగిందనుకొన్న రాజ్ తరుణ్, లావణ్య వివాదానికి మరోసారి ప్రాధాన్యత ఏర్పడింది. రాజ్ తరుణ్ నటించిన తిరుగబడరా సామి సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా మీడియా అడిగిన వివాదాస్పద ప్రశ్నలకు సహనంతో సమాధానం చెప్పిన ఆయన ఓ దశలో కంట్రల్ తప్పినట్టు కనిపించాడు. అయితే గోల గోలగా జరిగిన ఈ ప్రెస్ మీట్ తర్వాత లావణ్య ఆ వేదిక రావడం మరింత రచ్చగా మారింది. ఈ ప్రెస్ మీట్‌లో జరిగిన గలాటాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

గత నెల రోజులుగా రాజ్ తరుణ్, మాజీ లవర్ మధ్య గొడవ తీవ్రంగా జరుగుతున్నది. పోలీసు కేసులు, కోర్టు నోటీసుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న రాజ్ తరుణ్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. నేను హిట్ కొట్టినప్పుడు కూడా ఇంతమంది ప్రెస్ ప్రతినిధులు రాలేదు. వివాదం అనే సరికి చాలా మంది రావడం ఆశ్చర్యంగా ఉంది అని అన్నారు.

Lavanya disrupt Raj Tarun s Tirugabadara saami press meet at Prasad Labs

ఇక తనకు అబార్షన్ చేయించారనే ఆరోపణలపై స్పందిస్తూ.. మీడియా ఇలాంటి ప్రశ్నలు ఈ ప్రెస్ మీట్‌లో అడగడం తప్పు. నాపై అన్ని కేసులు పెట్టారు. వాటికి నోటీసులు అందుకొన్నాను. వాటికి సమాధానం కూడా కోర్టుకు సమర్పించాను. అబార్షన్ విషయంలో ఆమెపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించాడు. అంతేకాకుండా నాపై చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఎక్కడ అని అడగలేదు అని ప్రశ్నించాడు.

లావణ్య వివాదంపై అందరూ ప్రశ్నలు అడగడంతో..సినిమా ప్రమోషన్స్‌లో వ్యక్తిగతమైన ప్రశ్నలు అడగవద్దు. పదే పదే నా వ్యక్తిగతమైన విషయాలను మీడియాలోకి లాగవద్దని అభ్యర్థించారు. ఏదైనా కూడా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. నా 32 ఏళ్ల జీవితం లో వేలాది మంది తెలిసి ఉన్నారు .. ఎవరైనా ఒక్కరు వచ్చి నా మీద చెడుగా చెప్పమని చెప్పండి అని అన్నారు.

ఈ వివాదం కారణంగా వారం, పది రోజులుగా నేను ఇంట్లో కూర్చొని భాద పడుతున్నాను. నాతోపాటు నా తల్లిదండ్రుల కూడా చాలా బాధ పడుతున్నారు. నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను, నేను ఎక్కడ బయట పడి పారిపోలేదు. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే నేను బయటకి రాలేదు. లావణ్య దగ్గర ఉన్న ఆధారాలు కంటే నాతో కూడా చాలా ఆధారాలు ఉన్నాయి అని రాజ్ తరుణ్ అన్నారు.

అయితే ఈ మీడియా సమావేశం జరుగుతుండగా.. లావణ్య ప్రసాద్ ల్యాబ్ వద్దకు వచ్చారు. రాజ్ తరుణ్‌ను కలుసుకోవాలని గొడవ చేస్తే.. పోలీసులు అడ్డుకొన్నారు. నా మొగుడు రాజ్ తరుణ్‌తో హీరోయిన్ ఎలా సహజీవనం చేస్తున్నది. ఎలాంటి తప్పు చేయలేదనే ఆయన ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు అని లావణ్య ప్రశ్నించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X